Major OTT Release: 'మేజర్' సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
'మేజర్' సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది.
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మెజారిటీ థియేటర్లలో 'మేజర్' సినిమాను విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'మేజర్' సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు నెలల తరువాతే ఓటీటీలో విడుదలవుతుందని సమాచారం.
దీన్ని బట్టి ఆగస్టు మొదటి వారంలో ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం 'మేజర్' సినిమాకి హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మించాయి. అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.
Also Read: 'విక్రమ్' సినిమా ఓటీటీ-శాటిలైట్ రైట్స్ ఎంతంటే?
View this post on Instagram
View this post on Instagram