Shruti Haasan: ‘శృతి’ మించొద్దు - ఏంటా ముద్దులంటూ శృతి హాసన్‌పై నెటిజన్స్ ఫైర్!
ఇటీవల శృతి హాసన్ తన ప్రియుడితో కలసి ఓ రొమాంటిక్ వీడియోను చేసింది. దాన్ని సోషల్ మీడియాలో పెట్టగానే అది కాస్తా వైరల్ అయింది. దీంతో నెటిజన్స్ ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.
హీరోయిన్ శృతి హాసన్ తన ప్రియుడితో కలసివున్న ఓ రొమాంటిక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అది వెంటనే వైరల్ అయింది. నెటిజన్స్ ఆ వీడియోను చూసి ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక ఆమె అభిమానులైతే.. మాత్రం ‘‘ఇదేం బాలేదు శృతి’’ అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ సందేహం?
శృతి హాసన్ శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడూ వారిద్దరూ కలసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది శృతి. ఈ క్రమంలోనే తాజాగా శృతి శాంతనుతో కలసి చేసిన ఓ రీల్ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అందులో ఇద్దరూ ఒకరికొకరు కిస్ చేసుకుంటూ కనిపించారు. ఈ వీడియోతో పాటు ఓ నోట్ ను కూడా ఆమె రాసుకొచ్చింది. ‘‘శాంతను తిరిగి వచ్చాడు. అతను నా జీవితంలోకి వచ్చాక నన్ను చాలా మార్చేశాడు’’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఇప్పుడు నెటిజన్స్ ఈ వీడియో చూసి మండిపడుతున్నారు. ‘‘ఇలాంటివి మీ వ్యక్తిగతంగా షేర్ చేసుకుంటే పర్వాలేదు. కానీ, ఇలా పబ్లిక్‌గా షేర్ చేయొద్దు. ఇలాంటి వీడియోలతో ఏం చెప్పదలచుకున్నారు?’’ అంటూ పలువురు నెటిజనులు క్లాస్ పీకుతున్నారు. మరికొందరు మాత్రం క్యూట్ జోడి. ఇలాంటి వీడియోలు మరికొన్ని పెట్టండని ఆమెను ప్రోత్సహిస్తున్నారు.
వరస హిట్స్‌తో జోరు మీదున్న శృతి హాసన్
ఇక శృతి హాసన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల అయి మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. దీంతో శృతి హాసన్ కు మరింత డిమాండ్ పెరిగింది. ఓ వైపు యంగ్ హీరోలతో జతకడుతూనే మరోవైపు సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేస్తుంది. ఇటు తెలుగు, అటు తమిళ్ లోనూ నటిస్తూ బిజీ బిజీ గా ఉంటోంది. వీటితో పాటు భారీ ప్రాజెక్టుల్లోనూ భాగం అవుతోంది. ‘కెజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలోనూ నటిస్తోందని టాక్. ఇందులో ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. సినిమాల విషయంలో ఇంత ప్రొఫెషనల్ గా ఉండే శృతి హాసన్ పర్సనల్ లైఫ్ ను మాత్రం హ్యండిల్ చేయడంలో శృతి తప్పుతోంనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్
View this post on Instagram