Covid Positive: మరో హీరోయిన్‌కు కొవిడ్ పాజిటివ్
కొవిడ్ బారిన పడిన కథానాయికల జాబితాలో మరో హీరోయిన్ పేరు చేరింది. తనకు కరోనా సోకిందని ఆమె సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇంతకీ, ఆమె ఎవరు? అంటే...
హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ ఉన్నారు కదా! 'టాక్సీవాలా' సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు జంటగా నటించారు. 'తిమ్మరుసు', 'ఎస్.ఆర్. కళ్యాణ మండపం', 'గమనం' - గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె కొవిడ్ 19 బారిన పడ్డారు. తనకు కరోనా అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
"అందరికీ హాయ్... ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకున్నప్పటికీ నేను కొవిడ్ బారిన పడ్డాను. లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా... నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. మందులు కూడా వేసుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే, అందరూ మాస్క్ ధరించండి. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకండి" అని ప్రియాంకా జవాల్కర్ పేర్కొన్నారు.
సినిమా నటీనటులు ఎవరైనా సరే... తమకు కరోనా అని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు నుంచి కీర్తీ సురేష్ వరకూ అందరూ కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ డింపుల్ హయతి ఒక్కరే కరోనాతో ఐసోలేషన్‌లో ఉన్నారు.
View this post on Instagram
Also Read: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!
Also Read: కృతి శెట్టికి తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందో తెలుసా?
Also Read: ఇండస్ట్రీకి మంచి రోజులు ముందున్నాయి... జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున
Also Read: శాంతనుతో ఎప్పుడు ప్రేమలో పడిందీ, కలిసిందీ చెప్పిన శ్రుతీ హాసన్!
Also Read: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి