Krithi Shetty: కృతి శెట్టికి తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందో తెలుసా?

'ఉప్పెన'తో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక కృతి శెట్టి. ఆమెకు తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందో తెలుసా?

FOLLOW US: 
కృతి శెట్టి... కుర్రకారు మనసు దోచుకున్న కథానాయిక. 'ఉప్పెన'తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆమె పరిచయం అయ్యారు. తొలి సినిమా విడుదలకు ముందే, ఆ సినిమాలో 'నీ కన్ను నీలి సముద్రం' పాట విడుదల అయ్యింది. దాంతో ఆమె పాపులర్ అయ్యారు. తర్వాత సినిమా విజయం సాధించడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నటించిన 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలు కూడా విజయాలు సాధించాయి. దాంతో కృతి శెట్టి క్రేజీ కథానాయిక అయ్యారు. ఆమెతో నటించాలని  కొంత మంది హీరోలు అనుకుంటున్నారు. అయితే...  ఆమెకు ఎవరితో నటించాలని ఉందో తెలుసా? రామ్ చ‌ర‌ణ్‌తో!
అవును... కృతి శెట్టికి మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో నటించాలని ఉంది. ఆమె స్వయంగా చెప్పిన సంగతి ఇది. "నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. నేను చూసిన తొలి తెలుగు సినిమా 'రంగస్థలం'. రామ్ చరణ్ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యాయి. అవి కూడా చూశా. అయితే... 'రంగస్థలం'లో ఆయన నాకు బాగా నచ్చారు. ఆయనతో కలిసి నటించాలని ఉంది" అని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో కృతి శెట్టి చెప్పుకొచ్చారు. 
కృతి శెట్టి తొలి తెలుగు సినిమా 'ఉప్పెన' చూసి... చిరంజీవి లేఖ రాయడంతో పాటు గిఫ్ట్ సెండ్ చేశారు. అలాగే, రామ్ చరణ్ కూడా ప్రశంసించారు. సో... మంచి కథ కుదిరితే ఆయన పక్కన కృతి శెట్టికి త్వరలో అవకాశం వస్తుందని ఆశించవచ్చు. ప్రస్తుతం సుధీర్ బాబుకు జోడీగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', రామ్ పోతినేని సరసన 'ది వారియర్', నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాల్లో కృతి శెట్టి నటిస్తున్నారు.
Also Read: ఈ స్టార్ హీరోలు ఏం సాధించినా.. ఆ ఒక్క విషయంలో మాత్రం..
Also Read: ఇండస్ట్రీకి మంచి రోజులు ముందున్నాయి... జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున‌
Also Read: శాంతనుతో ఎప్పుడు ప్రేమలో పడిందీ, కలిసిందీ చెప్పిన శ్రుతీ హాసన్!
Also Read: ర‌జ‌నీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లికి ధ‌నుష్ చేసిన సాయం ఇదే!
Also Read: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!
Also Read: ఇప్పుడూ రజనీకాంత్ అల్లుడు అంటారా? ఆ ట్యాగ్ నుంచి ధనుష్ బయటకొచ్చాడా? లేదా?
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 19 Jan 2022 03:05 PM (IST) Tags: ram charan Krithi Shetty Rangasthalam Uppena

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో  - ఎవరికంటే?