By: ABP Desam | Updated at : 04 Dec 2022 12:31 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Pragathi Mahavadi/Instagram
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి రీల్ క్యారెక్టర్స్ కు పూర్తి విరుద్ధంగా రియల్ లైఫ్ ఉంటుంది. సినిమాలో చాలా కూల్ గా, సంప్రదాయ బద్దంగా కనిపించినా, బయట మాత్రం ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదు. జిమ్ నుంచి మొదలు కొని ఇంట్లో డ్యాన్స్ వరకు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. తమిళ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టిన ప్రగతి, సుమారు 10 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు.
పెళ్లి తర్వాత కొంత కాలానికి బుల్లితెరపైకి అడుగు పెట్టారు. పలు సీరియల్స్ లో నటించి మెప్పించారు. ‘బాబీ’ మూవీతో మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కరోనా లాక్ డౌన్ నుంచి ప్రగతిలోని కొత్త కోణం బయటకు వచ్చింది. అంతకు ముందెన్నడూ చూడని ప్రగతి కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రగతి హల్ చల్ ఓ రేంజిలో ఉంటోంది. ఫిట్ నెస్ కోసం ప్రగతి జిమ్ లో గంటలు గంటలు గడుపుతున్నారు. ఆ వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా, జిమ్ లో ఆమె చేసే వర్కౌట్స్ చూసి జనాలు వారెవ్వా అంటున్నారు. సినిమాల్లో చీరలో కనిపించి ఆకట్టుకునే ప్రగతి, బయట మాత్రం లేటెస్ట్ డ్రెస్సుల్లో కనిపించి ఫిదా చేస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా కనిపించి సందడి చేస్తున్నారు. పలు షోలలో గెస్టుగా పాల్గొని అదిరిపోయే పాటలకు అదుర్స్ అనిపించేలా స్టెప్స్ వేసి ఆకట్టుకుంటున్నారు. తాజాగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.
లేటెస్టుగా తన సిస్టర్ పెళ్లి వేడుకలో పాల్గొన్న ప్రగతి మామూలుగా రచ్చ చేయలేదు. ఎవరైనా డోలు దరువుకు స్టెప్పులు వేయడం కామన్ గా కనిపిస్తుంది. కానీ, అలా చేస్తే ప్రగతి ఎలా అవుతారు? ఆమె ఏకంగా డోలు మీద కూర్చొనే డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియోను ప్రగతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు మస్త్ ఖుషీ అవుతున్నారు. ఎంతైనా ప్రగతి రూటే సెపరేట్ అని కామెంట్స్ పెడుతున్నారు. మాస్ కాదు, ఊరమాస్ అంటున్నారు.
Read Also: జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ వసూళ్ల సునామీ, రజనీకాంత్ ‘ముత్తు‘ రికార్డును చిత్తు చేసేనా?
Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ
Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?
Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్