అన్వేషించండి

Payal Ghosh: 'ఎన్టీఆర్ గురించి అప్పుడే చెప్పా' నటి పాయల్ కామెంట్స్

ఎన్టీఆర్ కలిసి నటించాలని బాలీవుడ్ ముద్దుగుమ్మలు కోరుకుంటున్నారు. ఇప్పటికే అలియా భట్, దీపికా పదుకోన్ లాంటి స్టార్ హీరోయిన్లు ఎన్టీఆర్ తో నటించాలనుకుంటున్నట్లు చెప్పారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్ ని నటనలో బీట్ చేసేవారు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఆయన డాన్స్ మూమెంట్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ తెచ్చుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. 

ఎన్టీఆర్ కలిసి నటించాలని బాలీవుడ్ ముద్దుగుమ్మలు కోరుకుంటున్నారు. ఇప్పటికే అలియా భట్, దీపికా పదుకోన్ లాంటి స్టార్ హీరోయిన్లు ఎన్టీఆర్ తో నటించాలనుకుంటున్నట్లు చెప్పారు. దాదాపుగా ఎన్టీఆర్-అలియా కాంబో ఫిక్స్ అయినట్లేనని చెబుతున్నారు. 'గెహ్రాయియా' ప్రమోషన్స్ లో పాల్గొన్న దీపికా తెలుగు హీరోల గురించి మాట్లాడే సమయంలో ఎన్టీఆర్ తో కలిసి నటించాలనుందని తన ఇష్టాన్ని బయటపెట్టింది. 

ఎన్టీఆర్ అపూర్వమైన వ్యక్తిత్వం ఉన్న వాడని.. అద్భుతంగా నటిస్తాడని దీపికా ప్రశంసలు కురిపించింది. తాజాగా ఈ కామెంట్స్ పై నటి పాయల్ ఘోష్ స్పందించింది. రెండేళ్లక్రితం నటి మీరాచోప్రా.. ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని చెప్పింది. ఆ సమయంలో మీరాపై పాయల్ ఘోష్ మండిపడింది. ఆమెని తిడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది. ఎన్టీఆర్ గ్రేట్ యాక్టర్ అని పొంగింది పాయల్. 

ఇప్పుడు ఎన్టీఆర్ పై దీపికా పదుకోన్ చేసిన కామెంట్స్ విషయంలో పాయల్ సంతోషంగా ఉన్నట్లుంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్, మంచి మనిషి, లవింగ్ కోస్టార్.. అన్నింటికీ మించి ఆల్ రౌండర్ సూపర్ స్టార్.. ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. కానీ నన్ను అందరూ విమర్శించారు. తప్పుగా మాట్లాడారు. ఆయన స్టామినా గురించి తెలిసే ఇవన్నీ చెబుతూ వచ్చాను. ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తోంది. నేను చెప్పింది తప్పు కాదంటూ' రాసుకొచ్చింది. గతంలో ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది పాయల్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget