Prudhvi Raj: అంబటి రాంబాబు ఎవరో తెలీదు, ఓ పనికిమాలిన వ్యక్తి పాత్ర అని చెప్పారు: కమెడియన్ పృథ్వి రాజ్
ఇటీవల ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా కమెడియన్ పృథ్విరాజ్ మాట్లాడుతూ మంత్రి అంబటి రాంబాబు గురించి..
Prudhvi Raj: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ ‘బ్రో’. ఈ మూవీకు సముద్రఖని దర్శకత్వం వహించారు. జులై 28 న విడుదలైన ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీలో శ్యామ్ బాబు పాత్రలో నటించిన కమెడియన్ ఫృథ్వి రాజ్ మాట్లాడారు. సినిమాలో ఆయన పాత్ర గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ప్రస్తుతం ఫృథ్వి అన్న మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మానవ సంబంధాల గురించి చక్కగా చూపించారు: ఫ్వథ్వి రాజ్
‘బ్రో’ సినిమాలో తన పాత్రకు మంచి ఆదరణ లభించిందని అన్నారు ఫృథ్వి. పవన్ కళ్యాణ్ తాను చేసిన సినిమాల్లో ఇది నాలుగోదని, ఆయనతో నటించడం సంతోషంగా ఉందన్నారు. సినిమాలో సమయం గురించి, మానవ సంబంధాల గురించి దర్శకుడు సముధ్రఖని ఎంతో చక్కగా చూపించారని అన్నారు. ఈ సినిమా తర్వాత తాను కూడా టైమ్ విలువ తెలుసుకున్నానని అన్నారు. ఇలాంటి పాత్ర ఇచ్చిన మూవీ టీమ్ కు ధన్యావాదాలు తెలుపుతున్నానన్నారు.
మంత్రి అంబటి రాంబాబు ఎవరో నాకు తెలీదు..
ఈ సినిమాతో తాను నటించిన శ్యాం బాబు పాత్రకు మంచి క్రేజ్ వచ్చిందని, ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా ఇన్ని ఇంటర్వ్యూలు ఇవ్వలేదని అన్నారు. అయితే అది పొలిటికల్ గా కూడా బాగా చర్చనీయాంశమైందని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నపుడు తనను ఇదే విషయమై ప్రశ్నించారని, అంబటి రాంబాబు రాష్ట్ర మంత్రి అని ఆయన్ను ఇలా కామెడీగా చూపించడం కరెక్టేనా అని అడిగారని అన్నారు. అయితే తనకు అంబటి రాంబాబు ఎవరో తెలీదని చెప్పినట్టు చెప్పారు. అయినా అంబటి రాంబాబు ఇమిటేట్ చేసేంత గొప్ప ఆస్కార్ లెవల్ లో నటుడేమీ కాదని వ్యాఖ్యానించారు. తానేమీ సొంతంగా చేయలేదని అన్నారు. బార్ లలో మందు తాగుతూ అమ్మాయిలతో డాన్స్ చేసే ఓ పనికిమాలిన వ్యక్తి పాత్ర అని, పేరు శ్యాంబాబు అని దర్శకుడు సముద్రఖని చెప్పారని, తాను అలాగే చేశానని అన్నారు. అయితే అది పొలిటికల్ గా వైరలై తనకు మరింత పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ సన్నివేశానికి థియేటర్ లో ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారని అన్నారు.
సాయి ధరమ్ తేజ్ చిరంజీవిలా ఉంటారు..
ఇదే కార్యక్రమంలో ఫృథ్వి రాజ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడారు. తేజ్ తో తాను చేసిన సినిమాలు అన్నీ బాగా వచ్చాయని, తనకు ఆయన సినిమాల్లో మంచి అవకాశాలు ఇచ్చారని చెప్పారు. అలాగే ఈ సినిమాలో కూడా తనకు మంచి పాత్ర లభించిందని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ ను బయట అందరూ మెగాస్టార్ చిరంజీవితో పోలుస్తారని అన్నారు. ఈ సినిమాలో కూడా సాయి ధరమ్ తేజ్ చిరంజీవిలా కనిపించారని అన్నారు. తేజ్ కు ఇప్పుడు అన్నీ మంచి సినిమాలు వస్తున్నాయి. ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయని అన్నారు. ఇక నుంచి సాయి ధరమ్ తేజ్ హిట్ ల పరంపర కొనసాగుతుందని ఆకాక్షించారు పృథ్వి.
Also Read: ‘చంద్రముఖి 2’ రాజు వచ్చేశాడు - రాఘవ లారెన్స్ రాజసం అదిరిందిగా!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial