Ram Charan : రామ్ చరణ్ అరుదైన గౌరవం, ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ఎంట్రీ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే ఈ లిస్టులో చేరారు.
‘RRR’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రామ్ చరణ్. ఈ చిత్రంతో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. తాజాగా ఆయన మరో అరుదైన ఘనత సాధించారు. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు సంపాదించుకున్నారు. ‘RRR’ చిత్రంలో రామరాజుగా అద్భుత నటన కనబర్చిన ఆయనకు ఈ బ్రాంచ్ లో చోటు కల్పిస్తూ అకాడమీ అవార్డ్స్ టీమ్ నిర్ణయం తీసుకుంది.
రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ రీసెంట్గా యాక్టర్స్ బ్రాంచ్‌లోకి కొత్త సభ్యులను ఎంపిక చేసింది. తాజాగా ఈ లిస్టును విడుదల చేసింది. ఈ సందర్భంగా కొత్తగా ప్లేస్ సంపాదించుకున్న సభ్యులకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “అద్భుత నటన, అంకిత భావంతో ఈ నటుడు ప్రేక్షకులను ప్రేక్షకులను అలరించారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు జీవం పోశారు. తన నటనా సామర్థ్యంతో సాధారణ సినిమాలతోనూ అసాధారణ అనుభూతిని అందిస్తున్నారు. అన్ని రకాల భావోద్వేగాలను పంచుతూ ప్రశంసలు అందుకుంటున్నారు” అని వెల్లడించింది.ఇక కొత్తగా ఎంపిక అయిన వారి లిస్టులో రామ్ చరణ్‌తో పాటు మరికొంత మంది హాలీవుడ్ నటులు ఉన్నారు. ఇక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న రామ్ చరణ్‌కు సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ రీసెంట్గా యాక్టర్స్ బ్రాంచ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు.
View this post on Instagram
‘గేమ్ ఛేంజర్’గా రాబోతున్న రామ్ చరణ్
ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్టోరీని అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘RC16’ అనే వర్కింగ్ట టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Read Also: ఆ నిర్ణయంతో నా హృదయం బద్ధలైంది, సుశాంత్‌తో బ్రేకప్ గురించి ఎట్టకేలకు నోరు విప్పిన అంకిత!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial