అన్వేషించండి

Ankita Lokhande: ఆ నిర్ణయంతో నా హృదయం బద్ధలైంది, సుశాంత్​తో బ్రేకప్ గురించి ఎట్టకేలకు నోరు విప్పిన అంకిత!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్​తో బ్రేకప్ గురించి ఎట్టకేలకు ఆయన మాజీ ప్రియురాలు అంకితా లోఖండే స్పందించింది. తాను మనసు ఇస్తే, అతడు షాక్ ఇచ్చాడని వెల్లడించింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి మూడేళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ అతడి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. నటి రియా చక్రవర్తి తరచుగా ఈ టాపిక్​పై హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బయటపడిన మాదకద్రవ్యాల కేసులో ఆమె జైలుకు వెళ్లింది. దాదాపు నెల రోజులు జైలు జీవితం గడిపింది. తాజాగా సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాల అంకితా లోఖండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడితో లవ్ బ్రేకప్ గురించి కీలక విషయాలు వెల్లడించింది. 

ఆ మాట విని షాక్ అయ్యాను- అంకిత

సుశాంత్ సింగ్​ను తానో ఎంతో ప్రేమించానని చెప్పింది అంకిత. అతడు మాత్రం ఇతరుల మాటలు విని తనకు దూరం అయినట్లు వెల్లడించింది. “సుశాంత్ సింగ్ ను నేను ఎంతగానో ప్రేమించాను. చెప్పుడు మాటలు విని తను నాకు దూరం అయ్యాడు. ఇద్దరం విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేవు.  తనే విడిపోదామని చెప్పాడు. ఆయన మాటలు విని నేను ఒక్కసారి షాక్ అయ్యాను. సుశాంత్ ఎందుకు ఈ మాట అన్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆయన మాటలు విని రాత్రంతా ఏడ్చాను. ఎంతో మదనపడ్డాను. అతడు ఎందుకు నన్ను దూరం పెట్టాలి అనుకున్నాడో ఇప్పటికీ తెలియదు. ఇకపై తెలిసే అవకాశం లేదు. ఆయన నిర్ణయాన్ని నేను ఎప్పుడూ తప్పుబట్టలేదు. ఆయన మనసుకు నచ్చిన మాట చెప్పారు. కానీ, ఆయన చెప్పిన మాట నా మనసును ముక్కలు చేసింది. ఆయనతో బ్రేకప్ తర్వాత మరొకరితో  రిలేషన్ షిప్ అంటే వణుకు పుట్టేది” అని అంకిత వెల్లడించింది.

సీరియల్స్ చేసే సమయంలో ప్రేమాయణం

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చదువు పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదట్లో టీవీ సీరియల్స్ లో నటించారు. ఆ సమయంలో అంకితతో కలిసి పని చేశాడు సుశాంత్. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత సుశాంత్ హీరోగా మారడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. కొద్దికాలం తర్వాత విడిపోయారు. ఆ తర్వాత నటి రియా చక్రవర్తితో ప్రేమాయణం నడిపారు సుశాంత్. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో ఆయన చనిపోయారు. 

2020 జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మృతి

2020 జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని చనిపోయాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనది హత్య అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లింది. ఆయన మృతికి కారణాలు తెలుసుకునేందుకు సీబీఐ విచారణ కొనసాగిస్తోంది.   సుశాంత్ మరణానికి సంబంధించిన కారణాలపై స్పష్టత కోసం సోషల్ మీడియాలో ఆయన డిలీట్ చేసిన పోస్టులు, చాట్స్, ఈ-మెయిల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ వివరాలు తెలిస్తే ఆయన మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని  భావిస్తున్నారు. ఇప్పటికీ ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు.    

Read Also: కొత్త జంటతో కొణిదెల, అల్లు హీరోలు- మెగాస్టార్ షేర్ చేసిన ఫోటో చూశారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget