VarunLav : కొత్త జంటతో కొణిదెల, అల్లు హీరోలు- మెగాస్టార్ షేర్ చేసిన ఫోటో చూశారా?
VarunLav : వరుణ్ తేజ్, లావణ్య వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ చిరు ఓ ఫోటో షేర్ చేశారు.
VarunLav : మెగా హీరో వరుణ్ తేజ్, అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. బంధు మిత్రుల ఆశీర్వాదాలు, పండితుల వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లుతో పాటు కామినేని కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పెళ్లి ముందుకు కాక్ టైల్, మెహందీ, హల్దీ వేడుల్లో బంధు మిత్రులంతా పాల్గొని సందడి చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఒకే ఫ్రేమ్ లో కొణిదెల, అల్లు హీరోలు
తాజాగా సంసార జీవితంలోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాటికి శుభాకాంక్షలు చెప్తూ మెగాస్టార్ చిరంజీవి ఒక ఫోటో షేర్ చేశారు. అందులో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబానికి చెందిన హీరోలంతా ఉన్నారు. ఈ ఫోటోలో చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, శిరీష్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. మొత్తంగా ఒకే ఫ్రేమ్ లో కొణిదెల, అల్లు ఫ్యామిలీ హీరోలు కనిపించారు. ఈ ఫొటోకు చిరంజీవి ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. “మొత్తంగా వీళ్లు కొత్త ప్రేమతో కూడిన జర్నీని మొదలు పెట్టారు. సరికొత్త స్టార్ కపుల్ కు స్టార్స్ శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ పిక్ లో ఉన్న మెగా హీరోలతో పాటు సినీ అభిమానులు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. అటు ఈ నెల 5న ఇండస్ట్రీ మిత్రుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మాదాపూర్ లోని ఎన్- కన్వెన్షన్ సెంటర్ లో ఈ రిసెప్షన్ జరగనుంది.
View this post on Instagram
‘మిస్టర్’ సినిమా నుంచే ప్రేమాయణం
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. కానీ, ఇదే సినిమా షూటింగ్ సమయంలో వరుణ్, లావణ్య లవ్ లో పడ్డారు. ఈ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుంది. అప్పట్లోనే వీరి డేటింగ్ వ్యవహారంపై వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో లావణ్య బర్త్ డే పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీకి వరుణ్ హాజరై ఓ కాస్ట్లీ డైమండ్ రింగ్ తో లావణ్యకు ప్రపోజ్ చేశాడు. ఈ ప్రపోజల్ కు ఆమె కూడా ఓకే చెప్పింది. ఇది జరిగిన కొన్ని నెలలకే నాగబాబు తన కొడుకు పెళ్లి ప్రకటన చేశారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో వరుణ్ కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తామని చెప్పారు. దీంతో వీరిద్దరి పెళ్లి గురించి అధికారికంగా మెగా ఫ్యామిలీ నుంచి ప్రకటన వచ్చినట్లు అయ్యింది.
Read Also: మాటల్లేవ్ - విక్రమ్ 'తంగలాన్' టీజర్, ఆ యాక్షన్ చూశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial