05 Dec, 2023 18:37
05 Dec, 2023 16:42
05 Dec, 2023 16:36
Ayodhya Ram Mandir Politics : అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ అంశాలపై వేర్వేరుగా కాంగ్రెస్ నే టార్గెట్ చేసిన కేసీఆర్, ఒవైసీ
Congress Offer To Kodandaram: రాజ్యసభకు పంపిస్తామని కోదండరామ్ కు రాహుల్ హామీ
KCR vs Chidambaram: తెలంగాణ అమరవీరులపై కేసీఆర్, చిదంబరం మధ్య మాటల యుద్ధం
ఐటీ సోదాలు లేదా అభ్యర్థులపై దాడులు.. తెలంగాణలో ఏం జరుగుతోంది..?
Mallareddy Election Affidavits: మల్లారెడ్డి అఫిడవిట్ల గందరగోళంపై ఈసీకి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తాయా..?
Telangana Elections 2023 Campaigning: అన్ని పార్టీల ప్రచారంలో ఈ విషయాన్ని గమనించారా..?
Konda Surekha Interview: 75 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొండా సురేఖ ధీమా
Konda Surekha Interview: 75 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొండా సురేఖ ధీమా
Palakurthi Congress Candidate: నామినేషన్ తిరస్కరిస్తారంటూ ప్రచారం.. దానిపై స్పందించిన యశస్విని రెడ్డి
Old Woman Nomination: కొడుకుపై న్యాయపోరాటం, కన్నతల్లి నామినేషన్ అస్త్రం
Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ఉద్యమకారులకు శుభవార్త, కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం
Nitish Kumar: నితీష్ మాటలను పట్టించుకోని రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ కొంప ముంచిందా?
బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస
No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?
BRS MLA KTR: నిరాశ చెందవద్దు, బీఆర్ఎస్ కు త్వరలోనే మంచిరోజులు: కేటీఆర్
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Telangana Polls: తెలంగాణ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు, ఫోటోలతో ప్రచారాలు - అన్ని పార్టీలదీ అదే దారి !
Election Results 2023: కొద్ది తేడాతోనే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి! ఓటు శాతంపై ఆ పార్టీ అనాలసిస్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) సంస్థ 1950లో ఏర్పాటైంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఓ స్వతంత్ర సంస్థ ఇది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించడం ఈ సంస్థ విధి. వీటితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ బాధ్యతలూ తీసుకుంటుంది. రాజకీయ పార్టీల ప్రవర్తనా నియమావళినీ ఎన్నికల సంఘం నిర్దేశిస్తుంది.
రాజ్యాగంలోని ఆర్టికల్ 324 ఎన్నికలు ఎలా జరగాలో నిర్దేశిస్తుంది. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఎలక్షన్ ప్రక్రియ జరిగేలా చూస్తుంది.
2011 నుంచి ఎన్నికల సంఘం జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డే జరుపుతోంది. ఇందుకో కారణముంది. 1950లో జనవరి 25నే ఎన్నికల సంఘం ఏర్పాటైంది. ఇందుకు గుర్తుగా ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోంది. యువతీ యువకులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనూ ఈ ఓటర్స్ డేని జరుపుకుంటున్నారు.
1950 జనవరి 25వ తేదీన ఎన్నికల సంఘం ఏర్పాటైంది. 1989 వరకూ కేవలం ఒకే ఒక సభ్యుడితో ఈ సంఘం కొనసాగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ సంస్థని నడిపించే వారు.
దేశవ్యాప్తంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతను మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు చూసుకుంటాయి.
భారత్‌లో ఎన్నికల ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుంది. ముందు ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్‌ని ప్రకటిస్తుంది. అభ్యర్థుల నామినేషన్ తేదీలు, నామినేషన్ ఉపసంహరణ తేదీలు, నామినేషన్‌ల పరిశీలన, కౌంటింగ్ డేట్ లాంటి వివరాలు వెల్లడిస్తుంది. పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళినీ ప్రకటిస్తుంది. పోలింగ్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పార్టీలు ఎలా నడుచుకోవాలో నిర్దేశిస్తుంది.
రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు MLAలు. 18 ఏళ్లు పైబడిన ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరవాత ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలుస్తారో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ఎన్నికల సంఘం ఎప్పుడైతే పోలింగ్ షెడ్యూల్‌ని ప్రకటిస్తుందో ఆ రోజు నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఇది కొనసాగుతుంది.
1960లో తొలిసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. మేనిఫెస్టోలు ఎలా ఉండాలి..? రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలి..? అనే నిబంధనలు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఉంటాయి.
1919-1929 మధ్య కాలంలో అన్ని బ్రిటీష్ ప్రావిన్స్‌లు, ప్రిన్స్‌లీ స్టేట్స్‌లో మహిళలకు ఓటు వేసే హక్కు కల్పించారు. కొన్ని సార్లు స్థానిక ఎన్నికల్లో మహిళలు పోటీ చేసే అవకాశాన్నీ ఇచ్చారు.
భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత 1951లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కల్పా ప్రాంతానికి చెందిన రిటైర్డ్ టీచర్ శ్యామ్ శరణ్ నేగి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనే భారత్‌లో తొలి ఓటర్‌గా చరిత్రలో నిలిచిపోయారు.
1951-52లో తొలిసారి భారత్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ తరవాత రెండోసారి 1957లో, మూడోసారి 1962లో, నాలుగోసారి 1967లో జరిగాయి. 1971లో ఐదోసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ తరవాత 1977,1980,1984-85, 1989,1991లో ఎన్నికలు జరిగాయి. 1996లో పదకొండో సారి ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. తరవాత 1998,1999,2004,2009,2014లోనూ ఎన్నికలు జరిగాయి. 2019లో 17వ సారి ఎన్నికలు జరగ్గా...2024లో 18వ సారి భారత్‌లో ఎన్నికలు జరగనున్నాయి.