అన్వేషించండి

Telangana ABP C Voter Exit Poll : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ - ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడయిన అంచనాలు ఇవే

ABP Cvoter Exit Poll Results 2024 telangana: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో హోరాహోరీ పోరులో బీజేపీ, కాంగ్రెస్ చెరో సగం సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడయింది.

Telangana  Exit Poll ABP Cvoter :  తెలంగాణలో ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏబీపీ - సీ ఓటర్ వంద శాతం ఖచ్చితమైన అంచనాలను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 64 అసెంబ్లీ సీట్లను సాధించబోతోందని బీఆర్ఎస్ పార్టీ 40 లోపు సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ను ఏబీపీ - సీ ఓటర్ నిర్వహించింది. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు భిన్నత్వం ఎక్కువగా కనిపిస్తోంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడం వల్ల ఓటింగ్ ప్రయారిటీ అంశాలు మారిపోయాయి. అందుకే ఫలితాల్లోనూ భిన్నత్వం కనిపిస్తోంది. తెలంగాణలో ఏబీపీ - సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో మొదట ఓట్ షేర్‌ను చూద్దాం.
Telangana ABP C Voter Exit Poll : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ - ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడయిన అంచనాలు ఇవే

జాతీయ స్థాయి అంశాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగినందున జాతీయ పార్టీల మధ్యే ఎక్కువగా పోటీ జరిగింది. మొత్తం ఓట్లలో కాంగ్రెస్ పార్టీ  38.6 శాతం ఓట్లను సాధించబోతోంది. బీజేపీ ఓట్ల శాతం అనూహ్యంగా పెరగనుంది. ఆ పార్టీకి 33 శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనాలో వెల్లడయింది. తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు జాతీయ పార్టీల మధ్య  పూర్తి స్థాయిలో నలిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి కేవలం 20.3 శాతం ఓట్లు వస్తాయి.  మజ్లిస్ పార్టీకి 2 శాతం ఓట్లు వస్తాయని అంచనా. 

ఇక సీట్ల పరంగా చూస్తే తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అందులో 7 నుంచి 9 సీట్లు కాంగ్రెస్ పార్టీకి అదే 7-9 సీట్లు బీజేపీ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు 0 నుంచి 1 సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. గత లోక్ సభ ఎన్నికలలో 9లోక్ సభ సీట్లు గెల్చుకున్న భారత రాష్ట్ర సమితి తీవ్రంగా నష్టపోనుంది. అలాగే మజ్లిస్ పోటీ పడిన హైదరాబాద్ సీటులోనూ హోరాహోరీ పోరు నడిచిందని అర్థమవుతుంది. 

[DISCLAIMER: Current survey findings and projections are based on CVoter Exit Poll / Post Poll personal interviews conducted on polling day and after polling day among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.]

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Year Ender 2025 : మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Year Ender 2025 : మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
New Tata Punch: కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ త్వరలో రోడ్‌పైకి! కొత్త లుక్, పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో లాంచ్!
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ త్వరలో రోడ్‌పైకి! కొత్త లుక్, పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో లాంచ్!
Embed widget