అన్వేషించండి

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Telangana CM Revanth Reddy swearing Ceremony: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Revanth Reddy Takes oath As Telangana CM: హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మూడో సీఎం (రెండో నేత)గా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కారణంగా గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలున్నాయి. గురువారం (డిసెంబర్ 7న) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి.  

తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. దాంతో హైదరాబాద్ వాసులు ఎల్బీ స్టేడియం వైపుగా వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గురువారం హైదరాబాద్ లో ఎస్‌బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించనున్నారు. సుజాత స్కూల్‌ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలని సూచించారు. అదే విధంగా బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
    
ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా బషీర్‌బాగ్, ఎస్బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, లిబర్టీ సర్కిల్‌, రవీంద్ర భారతి, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే నగరవాసులు ట్రాఫిక్ ఆంక్షలు పాటించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎల్‌బీ స్టేడియంలో 30 వేల మందికి కూర్చొనే సౌక‌ర్యం ఉంది. మిగ‌తా జ‌నం కోసం స్టేడియం బ‌య‌ట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ట్రాఫిక్ అడ్వయిజరీని పోలీసులు విడుదల చేశారు.                                       

హైదరాబాద్ లో గురువారం ట్రాఫిక్‌ ఆంక్షలు...
ఎస్‌బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు వెళ్లాలని సూచన
బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్‌ కోఠి వైపు దారి మళ్లింపు
పబ్లిక్ గార్డెన్ నుంచి స్టేడియం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలి
సుజాత స్కూల్‌ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు

తెలంగాణ తొలి కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఇతర అధికారులు ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి, ఖైరతాబాద్‌ జోనల్‌  కమిషనర్‌ వెంకటేష్‌ దొత్రే, అడిషనల్‌ కమిషనర్లు స్నేహ శబరిష్‌, యాదగిరిరావు, ఉపేందర్‌రెడ్డి, సీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ పద్మజ పరిశీలించారు.
Also Read: ఇందిరమ్మ రాజ్య స్థాపనకూ అందరూ రండి - ప్రమాణస్వీకారానికి ప్రజలకు రేవంత్ ఆహ్వానం !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Same Chandrababu Plan: నాడు చంద్రబాబు ప్లానే నేడు జగన్ అమలు - మెజార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్తారా?
నాడు చంద్రబాబు ప్లానే నేడు జగన్ అమలు - మెజార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్తారా?
Hyderabad Crime News: బంజారాహిల్స్‌లో ఫుట్‌పాత్ మీదకు దూసుకెళ్లిన కారు- ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
Hyderabad Crime News: బంజారాహిల్స్‌లో ఫుట్‌పాత్ మీదకు దూసుకెళ్లిన కారు- ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
Rajamouli: మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి... సీజ్ ద లయన్‌, SSMB29 షూటింగ్ షురూ
మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి... సీజ్ ద లయన్‌, SSMB29 షూటింగ్ షురూ
Konda Surekha and Seethakka: సమ్మక్క, సారక్కలాగ ఉంటాం, కానీ మేం కలుసుకోవడం కష్టమే: విభేదాలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క క్లారిటీ
సమ్మక్క, సారక్కలాగ ఉంటాం, కానీ మేం కలుసుకోవడం కష్టమే: విభేదాలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vijaya Sai Reddy Quit Politics | రాజకీయాలు వదిలేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన | ABP DesamRachakonda CP on Meerpet Case | మీర్ పేట కేసు తేల్చాలంటే నిపుణులు కావాలి | ABP DesamMS Dhoni Rare Seen With Mobile | ప్రాక్టీస్ సెషన్ లో మొబైల్ తో ధోనీ | ABP DesamNetaji Subhash Chandra Bose Fiat Car | రాంచీలో పెట్టిన ఈ ఫియట్ కారు చరిత్ర తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Same Chandrababu Plan: నాడు చంద్రబాబు ప్లానే నేడు జగన్ అమలు - మెజార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్తారా?
నాడు చంద్రబాబు ప్లానే నేడు జగన్ అమలు - మెజార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్తారా?
Hyderabad Crime News: బంజారాహిల్స్‌లో ఫుట్‌పాత్ మీదకు దూసుకెళ్లిన కారు- ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
Hyderabad Crime News: బంజారాహిల్స్‌లో ఫుట్‌పాత్ మీదకు దూసుకెళ్లిన కారు- ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
Rajamouli: మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి... సీజ్ ద లయన్‌, SSMB29 షూటింగ్ షురూ
మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి... సీజ్ ద లయన్‌, SSMB29 షూటింగ్ షురూ
Konda Surekha and Seethakka: సమ్మక్క, సారక్కలాగ ఉంటాం, కానీ మేం కలుసుకోవడం కష్టమే: విభేదాలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క క్లారిటీ
సమ్మక్క, సారక్కలాగ ఉంటాం, కానీ మేం కలుసుకోవడం కష్టమే: విభేదాలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క క్లారిటీ
Why Vijayasai Reddy Resign: అదంతా సరే .. అసలు విజయసాయిరెడ్డి రాజీనామా ఎందుకు ? తెర వెనుక ఏం జరిగింది?
అదంతా సరే .. అసలు విజయసాయిరెడ్డి రాజీనామా ఎందుకు ? తెర వెనుక ఏం జరిగింది?
'టెట్' ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం, ఫలితాలు ఎప్పుడంటే?
'టెట్' ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం, ఫలితాలు ఎప్పుడంటే?
Tragedy In KCRs Family: మాజీ సీఎం కేసీఆర్ ఇంట విషాదం, బీఆర్ఎస్ నేతల సంతాపం
మాజీ సీఎం కేసీఆర్ ఇంట విషాదం, బీఆర్ఎస్ నేతల సంతాపం
Revanth Reddy: పీఎంఏవై కింద తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇళ్లు, మెట్రో ఫేజ్-IIను జేవీగా చేప‌ట్టాలి: కేంద్రాన్ని కోరిన రేవంత్ రెడ్డి
పీఎంఏవై కింద తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇళ్లు, మెట్రో ఫేజ్-IIను జేవీగా చేప‌ట్టాలి: కేంద్రాన్ని కోరిన రేవంత్ రెడ్డి
Embed widget