Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Telangana CM Revanth Reddy: ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా లేఖను స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. అనంతరం మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
Revanth Reddy open letter to Malkajgiri people: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా (Revanth Reddy Resigns As MP) లేఖను స్పీకర్ ఓం బిర్లాకు శుక్రవారం సాయంత్రం సమర్పించారు. అనంతరం మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ రాజీనామా తన ఎంపీ పదవికి మాత్రమేనని, తన మనసులో మల్కాజిగిరి ప్రజల స్థానం శాశ్వతం అన్నారు. ప్రశ్నించే గొంతుకగా తనను పార్లమెంటుకు పంపిన ఇక్కడి ప్రజలతో తన అనుబంధం శాశ్వతమని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి అని లేఖలో రాసుకొచ్చారు రేవంత్ రెడ్డి.
లోక్ సభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశాను.
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే…
నా మనసులో మల్కాజ్ గిరి ప్రజల స్థానం శాశ్వతం.
ప్రశ్నించే గొంతుకగా నన్ను పార్లమెంటుకు పంపిన ఇక్కడి ప్రజలతో నా అనుబంధం శాశ్వతం.
చివరి శ్వాస వరకు అటు కొడంగల్,
ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి.… pic.twitter.com/CyQT0gKKnU
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇటీవల సీఎంగా ప్రమాణ స్వీకారానికి పార్టీ పెద్దలను ఆహ్వానించేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి, శుక్రవారం మరోసారి ఢిల్లీకి వెళ్లారు. తన ఎంపీ పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేఖను సమర్పించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేతల్లో ఒకరైన మాణిక్యం ఠాకూర్ స్వయంగా రేవంత్ రెడ్డిని స్పీకర్ ఓం బిర్లా వద్దకు తీసుకెళ్లారు. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా లేఖను స్పీకర్ బిర్లాకు రేవంత్ రెడ్డి సమర్పించారు.