Ikkis Movie Collection: ఇక్కీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయ్... ధర్మేంద్ర లాస్ట్ సినిమా ఎర్లీ కలెక్షన్ రిపోర్ట్
Ikkis First Day Collection: బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణించిన తర్వాత ఆయన ఆఖరి సినిమా 'ఇక్కీస్' థియేటర్లలోకి వచ్చింది. ఆగస్త్య నంద హీరోగా నటించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఎంతంటే?

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra) నటించిన చివరి చిత్రం 'ఇక్కీస్' (Ikkis Movie). ఈ రోజు (జనవరి 1వ తేదీన) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అగస్త్య నందా, జైదీప్ అహ్లావత్, సిమర్ భాటియా ముఖ్య పాత్రలు పోషించారు. సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్ పాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణ ఫలించింది. సినిమా విడుదల కావడానికి రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఇప్పటికి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
అగస్త్య నందా, సిమర్ భాటియా వంటి కొత్త తారలను పరిగణనలోకి తీసుకుంటే... 'ఇక్కీస్' అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. 'సన్ ఆఫ్ సర్దార్ 2', 'కేసరి చాప్టర్ 2', 'పరం సుందరి', 'దే దే ప్యార్ దే 2' వంటి స్టార్ హీరోల సినిమాల కంటే ఈ సినిమా బుకింగ్స్ మెరుగ్గా ఉన్నాయి. ఆయా చిత్రాలతో పోలిస్తే 'అవతార్: ఫైర్ అండ్ యాష్'తో 'ఇక్కీస్' పోటీ పడింది. కొత్త సంవత్సరం రోజున నేషనల్ చైన్స్‌లో ప్రీ - సేల్స్ బావున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 'ఇక్కీస్' ఎంత సంపాదించిందంటే?
పింక్ విల్లా నివేదిక ప్రకారం, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 'ఇక్కీస్' సినిమా మొదటి రోజు 5 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. నేషనల్ చైన్స్‌లో దాదాపు 35,000 టిక్కెట్లు అమ్ముడు అయ్యాయి. దీనితో పాటు మౌత్ టాక్ మీద కూడా సినిమా వసూళ్లు ఆధారపడి ఉంటాయి. అందువల్ల సినిమా కలెక్షన్లలో పెరుగుదల కనిపించవచ్చు.
ప్రేక్షకుల నుంచి సినిమాకు సానుకూల స్పందన లభిస్తోంది. దీని వల్ల బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించగలదు. సినిమా ఓపెనింగ్ వీకెండ్‌లో మంచి కలెక్షన్లు సాధించగలదు. 'ఇక్కీస్' మంచి కలెక్షన్లు సాధిస్తే... అది 'ధురందర్' చిత్రానికి కలెక్షన్ల విషయంలో గట్టి పోటీ ఇవ్వగలదు. ఇది ధర్మేంద్ర చివరి సినిమా కావడంతో అభిమానులు చాలా భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ చిత్రంలో అగస్త్య నందా తండ్రి పాత్రలో ఆయన కనిపించారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్



















