Bobbili Constituency: బొబ్బిలిలో ఎన్నికల పోరు ఆసక్తికరం - ఈసారి విజయం ఎవరిని వరించేనో?
Who is the boss of Bobbili? The fight is interesting : విజయనగరం జిల్లాలోని మరో నియోజకవర్గం బొబ్బిలి. బొబ్బిలి రాజుల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి.
Bobbili Election Fighting: విజయనగరం జిల్లాలోని మరో నియోజకవర్గం బొబ్బిలి. బొబ్బిలి రాజుల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, మూడుసార్లు టీడీపీ, రెండుసార్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,02,364 మంది ఓటర్లు ఉండగా, 99,068 మంది పురుష ఓటర్లు, 1,03,292 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 16వ సార్వత్రిక ఎన్నికలకు నియోకజవర్గం సిద్ధం అవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి ఇక్కడ సర్వత్రా నెలకొంది.
కాంగ్రెస్ పార్టీని వరించిన విజయాలు
ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా, అత్యధికంగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 1952లో ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుంచి విజయం సాధించిన కేవీకే నాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె సీతారామస్వామిపై 4385 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేఎస్ స్వామి తన సమీప ప్రత్యర్థి పీఎస్పీ నుంచి పోటీ చేసిన టీఎల్ నాయుడుపై 369 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీఎల్ నాయుడు తన సమీప ప్రత్యర్థి పీఎస్పీ నుంచి పోటీ చేసిన ఏ గంగయ్యపై 20,333 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్‌ఆర్‌కే రంగారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీఎల్ నాయుడుపై 28,561 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీవీ కృష్ణ రంగారావు తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కె కూర్మినాయుడిపై 2345 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన కేవీకే నాయుడు తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆర్‌ఎస్ రావుపై 13,477 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఎస్‌వీసీఏ నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేఎన్ వాసిరెడ్డిపై 16,950 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌సీవీఏ నాయుడు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఐవీ రమణమూర్తిపై 29,448 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి జగన్మోహనరావు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌వీసీఏ నాయుడిపై 98 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌వీసీఏ నాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి జగన్మోహనరావుపై 6087 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి జగన్మోహనరావు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌వీసీఏ నాయుడిపై 9312 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సుజయ కృష్ణరంగారావు టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌వీసీఏ నాయుడిపై 12,690 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావు తన సమీప ప్రత్యర్థి తెంటు లక్ష్మునాయుడుపై 24,172 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావు మూడోసారి ఇక్కడి నుంచి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన తెంటు లక్ష్మునాయుడుపై 6958 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎన్ చిన అ్పలనాయుడు ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావుపై 8352 ఓట్ల తేడాతో గెలుపొందారు.
మూడుసార్లు చొప్పున విజయాలు
ఈ నియోజకవర్గంలో ఎస్‌వీసీఏ నాయుడు మూడుసార్లు, సుజయ కృష్ణ రంగారావు మూసార్లు చొప్పున విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏడుసార్లు విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థులు మూడుసార్లు, వైసీపీ రెండుసార్లు ఈ నియోజకవర్గంలో విజయం సాధించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, వైసీపీ సిద్ధమవుతున్నాయి. మరోసారి శంబంగి చిన్న అప్పలనాయుడు వైసీపీ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా, టీడీపీ నుంచి బేబీ నాయన పోటీకి సిద్ధపడుతున్నారు.