(Source: ECI/ABP News/ABP Majha)
కలాం, బాలయోగికి పదువులు ఇచ్చిందెవరు? ఎన్డీఏ ఘనతను బీజేపీ ఖాతాలో మోడీ వేస్తున్నారా?
ప్రధాన మంత్రి మోడీ పనిలోపనిగా వాజ్‌పేయ్ హయాంలో పదవుల గురించి కీలకంగా ప్రస్తావించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది, దళితుడైన జీఎంసీ బాలయోగిని స్పీకర్ నియమించింది బీజేపీయేనని గుర్తు చేశారు.
PM Modi: హైదరాబాద్: బీఆర్ఎస్(BRS) కాంగ్రెస్(Congress) సీ టీం అని, కాంగ్రెస్ బీఆర్ఎస్ సీ టీం అంటూ మోడీ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏలు రెండు ఒక్కటే నని, రెండు కుటుంబపార్టీలేనని టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ స్పీచ్ ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత సీన్ మార్చేశారు. బీసీలు, తెలుగుదేశం పార్టీ సెంట్రిక్‌గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీలను అక్కున చేర్చుకుంది. ఆ పార్టీకి ఉన్న బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకే బీజేపీ బీసీ మంత్రాన్ని జపిస్తోందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. బీసీలకు ఎక్కువ అసెంబ్లీ టికెట్లు ఇచ్చిందంటూనే, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. దాదాపు 30 దశాబ్దాల పాటు టీడీపీకి అండగా ఉన్న బీసీలు చాలా మంది వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. ఉన్న కొద్ది మంది ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మోడీ బీసీ మంత్రం జపిస్తున్నారు బీజేపీ నేతలు.
అందుకే ప్రధానమంత్రి మోడీ ఎక్కడా టీడీపీ, ఎన్డీఏ ప్రస్తావన లేకుండా వాజ్‌పేయ్ హయాంలో పదవుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది, దళితుడైన జీఎంసీ బాలయోగిని స్పీకర్ నియమించింది బీజేపీయేనని గుర్తు చేశారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడం, జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్ పదవులు చేపట్టింది ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ క్రెడిట్‌ను బీజేపీ ఖాతాలోకి వేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రస్తుత టీడీపీ చీఫ్ చంద్రబాబు అప్పటి ఎన్డీఏ కన్వీనర్‌గా ఉన్నారు. అబ్దుల్ కలాంను పట్టుబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పించానని చాలా సార్లు చెప్పుకున్నారు. అలాగే జీఎంసీ బాలయోగి స్పీకర్ పదవి చేపట్టినపుడు కూడా ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడే ఉన్నారు.
ప్రధాన మంత్రి మోడీ స్పీచ్ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్డీఏలో హయాంలో అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా, పీఏ సంగ్మా బాలయోగిలను లోక్ సభ స్పీకర్లు ఎన్నుకుంటే ఆ క్రెడిట్ లో వేసుకున్నారు. వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఈ పేర్లను ప్రతిపాదన ఎవరు చేసినప్పటికీ, ఎన్డీఏలోని భాగస్వామయ్య పార్టీలన్ని అబ్దుల్ కలాం, బాలయోగి పోటీపై మూకుమ్మడిగా చర్చించాయి. గెలుపు లెక్కలు వేసుకున్నాయి. ఆ తర్వాత వారిద్దర్ని గెలిపించుకున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటే వాటిని భారతీయ జనతా ఖాతాలో వేసుకోవడం, తప్పులు జరిగితే వాటిని ఎన్డీఏ కూటమి వేస్తున్నారన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. అప్పటి ఎన్డీఏలో కాంగ్రెస్ ను వ్యతిరేకించిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఆ పార్టీలకు అసలు క్రెడిట్ ఇవ్వకుండా తమ అంతా చేశామని చెప్పుకోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. జీఎంసీ బాలయోగి టీడీపీ ఎంపీ, అయినా మోదీ టీడీపీ పేరు కానీ, చంద్రబాబు పేరు కానీ తీసుకురాలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి, అక్రమాలపైన ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబపాలన సాగుతోందని, ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో వారి నుంచి రాబడతామని ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ ప్రభుత్వం వైఫల్యమేనన్న మోడీ...అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపిన మోడీ...ఒక తరం జీవితాలను గులాబీ పార్టీ నేతలు నాశనం చేశారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోడీ...బీసీల ఆకాంక్షలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.