అన్వేషించండి

Vijay TVK and AIADMK Alliance: తమిళనాడులో సీఎంగా విజయ్‌! డిప్యూటీ సీఎంగా అన్నాడీఎంకే నేత! పొత్తు దిశగా అడుగులు!

తమిళనాడు ఫలితాల ట్రెండ్స్ సంచలనం సృష్టిస్తున్నాయ. విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్రి కజగం దాదాపు వందకుపైగా సీట్లలో ముందంజలో ఉంది. నటుడు విజయ్‌ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా అవతరించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తమిళనాడు రాజకీయాల్లోకి దళపతి విజయ్ నేతృత్వంలో కొత్త పార్టీ ప్రవేశించింది.
  • ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవచ్చు.
  • ప్రభుత్వం ఏర్పాటుకు ఏఐఏడీఎంకే, టీవీకే కూటమి అవసరం కావచ్చు.
  • విజయ్ షరతులు, పళనిస్వామి అంగీకారం కీలకంగా మారనున్నాయి.

Vijay TVK and AIADMK Alliance: తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 మే 4వ తేదీ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య సాగుతున్న ద్విముఖ పోరాటంలోకి దళపతి విజయ్ రూపంలో ఒక మూడో శక్తి బలంగా వచ్చింది. కేవలం రెండేళ్ల క్రితమే ప్రారంభించిన తమిళగ వెట్రి కజగం తన తొలి ఎన్నికల్లోనే వందకుపైగా సీట్లు సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు సమీపంలో ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడులో వస్తున్న ఫలితాలు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. 

ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం ఏ పార్టీకీ స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ వచ్చే ఛాన్స్ లేదు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు రావాల్సి ఉంది. ఈ మ్యాజిక్ ఫిగర్‌కు సమీపంలో ఉంది విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే. ఇప్పటికే సీనియర్ పార్టీలుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్నా సరే కచ్చితంగా విజయ్ సహకారం అవసరం. వారి కంటే ఎక్కువ సీట్లు గెలుపొందిన విజయ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే ఏ పార్టీకి కూడా మద్దతు ఇచ్చే ఛాన్స్ లేదు. ఆయన ఒకవేళ ఏదైనా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం కచ్చితంగా వారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి ఉంటుంది. 

Also Read: తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!

ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ బయటకు రాగానే చెన్నైలోని రాజకీయ వర్గాల్లో అన్నా డీఎంకే, టీవీకే మధ్య పొత్తుపై చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఎప్పుడూ సాఫీగా లేవు. 2025లో ఈ రెండు పార్టీల పొత్తు గురించి చర్చలు జరిగాయి. కానీ విజయ్ కొన్ని కఠినమైన షరతులు విధించినట్టు తెలుస్తోంది. పొత్తుకు నాయకత్వం వహించడం, విజయ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, మొత్తం 234 స్థానాల్లో సగం అంటే 117 స్థానాలు కేటాయించాలని షరతులు పెట్టినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న అన్నా డీఎం మొన్న పుట్టిన పార్టీకి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చేందుకు అంగీకరించలేదని దీంతో ఆ చర్చలు విఫలమైనట్టు తమిళనాడు పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. 

పొత్తు కుదరకపోవడంతో, అన్నా డీఎంకే తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. విజయ్‌ ఒంటరిగానే బరిలో దిగి సింహం సింగిల్‌గా వస్తుందని ప్రచారం చేసుకున్నారు. ప్రచారంలో విజయ్ అటు డీఎంకేను ఇటు బీజేపీని లక్ష్యంగా చేసుకుంటూనే అన్నాడీఎంకేనూ దూరంగా పెడుతూ వచ్చారు. 

ఇప్పుడు పొత్తు సాధ్యమేనా!

ప్రస్తుతం ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాని టైంలో రాజకీయ సమీకరణాలు మారక తప్పవు. టీవీకే, అన్నా డీఎంకే చేతులు కలిపితే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమని ట్రెండ్స్ సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని కీలక అడ్డంకులు ఉన్నాయి. అన్నా డీఎంకే అధినేత పళని స్వామి విజయ్‌ను సమాన స్థాయి నాయకుడిగా అంగీకరిస్తారా గతంలో ముఖ్యమంత్రి పీఠం కోసం విజయ్‌ చేసిన డిమాండ్‌ను ఇప్పుడు పళని స్వామి ఒప్పుకుంటారా అన్నది ప్రశ్నార్థకం. ఎన్నికల ప్రచారంలో ఒంటరిగానే పోటీ చేస్తాం, ఎవరితో పొత్తు పెట్టుకోమని విజయ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఫలితాల తర్వాత మాట మారుస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అన్నా డీఎంకే వెయిట్ అండ్ సీ అన్న ధోరణితో ఉంది. విజయ్‌కు మద్ధతు ఇచ్చే విషయంలో వారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 

నటుడు జోసెఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్‌ తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని మాస్ ఇమేజ్‌ ఉన్న నటుడు. ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినీ గ్లామర్‌తో రాజకీయాల్లో రాణించినట్టే విజయ్ కూడా అదే బాటలో పయనించారు. 49 ఏళ్ల తమిళ రాజకీయ చరిత్రలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం అనేది సామాన్యమైన విషయం కాదు. 

Frequently Asked Questions

తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా వచ్చిన పార్టీ ఏది?

తమిళనాడు రాజకీయాల్లోకి 'తమిళగ వెట్రి కజగం' (టీవీకే) అనే కొత్త పార్టీ వచ్చింది. ఇది కేవలం రెండేళ్ల క్రితం ప్రారంభించబడింది.

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం తమిళనాడులో ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది?

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ పార్టీ సహకారం ఎవరికి అవసరం?

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు విజయ్ పార్టీ (టీవీకే) సహకారం ఖచ్చితంగా అవసరం.

గతంలో టీవీకే, ఏఐఏడీఎంకే మధ్య పొత్తు ఎందుకు విఫలమైంది?

గతంలో టీవీకే, ఏఐఏడీఎంకే మధ్య పొత్తు కుదరలేదు. టీవీకే నాయకత్వం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌ను ప్రకటించడం, సగం సీట్లు కేటాయించాలని విజయ్ షరతులు విధించడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget