Pendurthi Assembly constituency: పెందుర్తిలో ఈసారి గెలుపు ఎవరిదో..? పోరుకు సిద్ధమవుతున్న నేతలు
Pendurthi Assembly constituency: :జిల్లాలోని మరో నియోజకవర్గం పెందుర్తి. ఈ నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరగగా, నాలుగు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
Pendurthi Assembly constituency: ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం పెందుర్తి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 2.11,366 మంది ఓటర్లు ఉన్నారు. వీరుల పురుషు ఓటర్లు 1,02,179 మంది కాగా, మహిళా ఓటర్లు 1,09,182 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరగగా, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాలు ఇవే
పెందుర్తి నియోజకవర్గంలో తొలిసారిగా 1967 లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జి బుచ్చి అప్పారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అల్లు దశావతారంపై 5629 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఏఎస్ఆర్ ఉప్పలపాటి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన బిఏ గొర్రెపాటిపై 7036 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జి అప్పన్న విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సిపిఎం నుంచి పోటీ చేసిన ఐ.ఎస్ గంగాధర రెడ్డిపై 10,047 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి సత్యనారాయణ తన సమీప కృతజ్ఞతలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పి సింహాచలంపై 5527 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పి అప్పల నరసింహంపై ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి సత్యనారాయణపై 32,355 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
1985లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన ఏ రామచంద్రరావు ఇక్కడ విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జి గురునాథరావుపై 9209 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జి గురునాధరావు ఇక్కడ విజయం దక్కించుకున్నారు. టిడిపి నుంచి పోటీ చేసిన పి సింహాచలంపై 13,903 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ నుంచి పోటీ చేసిన ఎం ఆంజనేయులు గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి శ్రీనివాస్ పై 30,987 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన పి గణబాబు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి శ్రీనివాస్ పై 23,589 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పి గురుమూర్తి రెడ్డి తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన జి నాగమణిపై 18,150 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన పి రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి గండి బాబ్జి పై 3,272 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తి తన సమీప ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన గండి బాబ్జి పై 18,648 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన అదీప్ రాజు అన్నపురెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తి పై 28 860 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
రానున్న ఎన్నికల్లో పోటీకి సై
వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పలువురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా మరో ఇద్దరు నేతలు కూడా సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మరోసారి ఇక్కడ బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. జనసేన పార్టీ ఈ సీటును ఆశిస్తోంది. జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేష్ బాబు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. చూడాలి 2024 ఎన్నికల్లో ఎక్కడ ఏ పార్టీ జెండా ఎగరబోతుందో.