By: ABP Desam | Updated at : 13 Jul 2022 12:40 PM (IST)
ఇలా ఆధార్‌కు ఓటర్ కార్డు లింక్ చేసుకోండి - ఆగస్టు ఒకటి నుంచే చాన్స్ !
Voter Card Aadhar Link : ఇప్పుడంతా ఆధార్ శకం. మన ప్రతి గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానించుకోవాల్సిన సమయం. ఇప్పటి వరకూ పాన్ కార్డు సహా ప్రతీది ఆధార్‌తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఓటర్ కార్డు వంతు వచ్చింది. ఆధార్‌తో ఓటర్ కార్డును అనుసంధానించడం ద్వారా ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చేయాలని అక్రమాలకు అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నారు. అందుకే చట్ట సవరణ కూడా చేశారు. ఇప్పుడు నేరుగా ఆధార్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఏపీలో అన్నీ పార్టీలదీ ఒకే మాట - మళ్లీ ఇలాంటి సందర్భం వస్తుందా ?
ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ( https://eci.gov.in/ ) కూడా ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. దీని కోసం ఫారం 6 బి అందుబాటులోకి తెస్తారు. ఆన్‌లైన్‌లో ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవాలంటే ఆధార్ వద్ద నమోదైన నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేసాక అథంటికేషన్ వస్తుంది. దాన్ని పూర్తి చేస్తే ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి డిస్ట్రిక్ట్స బూత్ లెవల్ ఆఫీసర్లు కూడా ఇంటింటికీ తిరిగి ఆధార్ ఫోటో కాపీ తీసుకోవడం ద్వారా లింకప్ చేస్తారు.ఈ ప్రక్రియును వీలయినంత వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
రెండు రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తా - సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నానన్న పయ్యావుల !
నిజానికి ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమయింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా హెచ్ఎస్ బ్రహ్మ ఉన్నప్పుడే ఓటర్ , ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రారంభించారు. కొన్ని రోజుల పాటు ఉధృతంగా సాగింది. అయితే తర్వాత న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్ట సవరణ చేయడంతో మళ్లీ ఆధార్, ఓటర్ కార్డ్ అనుసంధానానికి మార్గం సుగమం అయింది.
తెలంగాణలో అన్ని పార్టీలూ ముందస్తుకు రెడీ ! మరి ఎన్నికల గంట కొట్టేదెవరు ?
ఓటర్ కార్డులను ఆధార్ తో అనుసంధానించడం ద్వారా బోగస్ ఓటర్లను నివారించవచ్చని ... దొంగ ఓటర్లను పూర్తి స్థాయిలో అడ్డుకోవచ్చని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా రెండో ఆధార్ కార్డు తీసుకోవడం సాధ్యం కాదు. అలాగే ఒకరి ఆధార్‌ను మరొకరు ఉపయోగించడం సాధ్యం కాదు. ఈ కారణంగా ఆధార్‌తో ఓటర్ కార్డును అనుసంధానించడం వల్ల ఎన్నికల అక్రమాలు చాలా వరకూ తగ్గుతాయని భావిస్తున్నాయి. అయితే వంద శాతం లక్ష్యం నెరవేరినప్పుడే ఇది సాధ్యమని.. ఆధార్ లేని వారి ఓట్లు కొనసాగిస్తే ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!
భలే మంచి రోజు, రండీ కండువా కప్పుకోండీ- నేతలకు బీజేపీ ఆఫర్
మునుగోడులో ఎవరి బలం ఎంత- ఈ సారి ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు?
ఆ ఎన్నిక విషయంలో ఒక్కటైన కాంగ్రెస్, టీఆర్ఎస్
ఓటర్ల జాబితాలో సవరణకు నూతన మార్గదర్శకాలు- ఆధార్‌తో అనుసంధాన ప్రక్రియ ప్రారంభం
Asia Cup, India's Predicted 11: పాక్ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్ అంచనా నిజమవుతుందా?
Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!
Election For Congress Chief: కాంగ్రెస్ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!
Srisailam Reservoir Gates Opend: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత|ABP Desam