News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Payyavula : రెండు రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తా - సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నానన్న పయ్యావుల !

రెండు రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తానని పయ్యావుల కేశవ్ ప్రకటించారు. చంద్రబాబుతో భేటీకి ఆయన సెక్యూరిటీ లేకుండానే వచ్చారు.

FOLLOW US: 
Share:

Payyavula Kesav :  రెంజు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడిస్తానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశం కోసం ఆయన నివాసానికి వచ్చిన పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. సోమవారం పయ్యావుల కేశవ్‌ భద్రతను ఉపసంహరించారు. అయితే మధ్యాహ్నం సమయంలో మరో గన్‌మెన్ వచ్చి పయ్యావులకు రిపోర్ట్ చేశారు. తాను కొత్త గన్‌మెన్‌ను అని పరిచయం చేసుకున్నారు. అయితే ఉన్నతాధికారులు ఎవరూ సమాచారం ఇవ్వకుండా నేరుగా వచ్చి  ఎలా గన్‌మెన్ గా ఉంటారని  పయ్యావుల ప్రశ్నించారు.  ఈ అంశంపైనా పయ్యావుల మాట్లాడారు. 

గుడ్మార్నింగ్ సీఎం సార్ ఈ రోడ్డు చూశారా? జూలై 15 నుంచి జనసేన కొత్త ఉద్యమం !

గన్‌  మెన్ అంటూ  వచ్చిన సదరు వ్యక్తి తనకు కనిపించలేదని పయ్యావుల మీడియాకు తెలిపారు. ఈ రోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పయ్యావుల  గన్ మెన్ లేకుండానే ఆయన వెళ్లారు. ప్రస్తుతం తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదని… ఏం జరుగుతోందో చూద్దామని అన్నారు. రెండు రోజుల్లో కీలక విషయాలు వెల్లడిస్తానన్నారు. పయ్యావుల కేశవ్ టీడీపీ తరబపున బలమైన వాదన వినిపించడంలో ముందు ఉంటారు. గతంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ. వేల కోట్లకు లెక్కలు లేవని పత్రాలు బయట పెట్టారు. 

తెలంగాణలో అన్ని పార్టీలూ ముందస్తుకు రెడీ ! మరి ఎన్నికల గంట కొట్టేదెవరు ?

పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.  ఈ అంశం సంచలనం సృష్టించింది. ఇటీవల ప్రభుత్వం పెగాసస్ అంశంపై సభా కమిటీని నియమించింది. గత ప్రభుత్వం డేటా చోరీ చేసిందంటూ ఆ సభా కమిటీ చైర్మన్ భూమన ప్రకటన చేశారు. దీన్ని ఖండిస్తూ పయ్యావుల .. ప్రభుత్వమే ప్రస్తుతం ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి నగదురూపంలో చెల్లింపులు చేయించి ఈ ట్యాపింగ్ చేయిస్తున్నారని.. సొంత ఎమ్మెల్యేలు.. సాక్షి ఉద్యోగులపైనా నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు. విద్యాశాఖ బిల్లుల పెండింగ్ - ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్

బహుశా దీనికి సంబంధించిన వివరాలే ఏమైనా బయట పెడతారేమోనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పయ్యావుల మాట్లాడే అంశాలన్నీ పకడ్బందీగా ఉంటాయని.. పూర్తి సమాచారం మేరకే మాట్లాడతారని నమ్మకం ఉండటంతో రాజకీయవర్గాల్లోనూ పయ్యావుల రెండు రోజుల్లో ప్రకటిస్తానన్న సంచలన విషయాలు ఏమై ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. 

Published at : 12 Jul 2022 05:25 PM (IST) Tags: payyavula keshav Uravakonda MLA TDP MLA Keshav

ఇవి కూడా చూడండి

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్‌ తీర్పుపై తీవ్ర విమర్శలు

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్‌ తీర్పుపై తీవ్ర విమర్శలు

Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్‌ గాంధీ

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

Vasundhara Raje: బీజేపీ పరివర్తన యాత్రకు వసుంధర రాజే డుమ్మా ! అధిష్టానం తీరుపై అలక

Vasundhara Raje: బీజేపీ పరివర్తన యాత్రకు వసుంధర రాజే డుమ్మా ! అధిష్టానం తీరుపై అలక

టాప్ స్టోరీస్

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

Varanasi Stadium: మోడీ అడ్డాలో భారీ క్రికెట్ స్టేడియం - శివతత్వం ప్రతిబింబించేలా నిర్మాణం - తరలిరానున్న అతిరథులు

Varanasi Stadium: మోడీ అడ్డాలో భారీ క్రికెట్ స్టేడియం - శివతత్వం ప్రతిబింబించేలా నిర్మాణం - తరలిరానున్న అతిరథులు