By: ABP Desam | Updated at : 12 Jul 2022 02:52 PM (IST)
విద్యాశాఖ బిల్లుల పెండింగ్ - ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్
AP Highcourt : ఆంధ్రప్రదేశ్ అధికారులకు హైకోర్టు నుంచి చీవాట్లు తప్పడం లేదు. గతంలో పలువురు సివిల్ సర్వీస్ అధికారులు కోర్టు ధిక్కరణ కింద శిక్షకు గురయ్యారు. ఏదో విధంగా వారు ఆ శిక్షల్ని నిలిపి వేయించుకోగలిగారు కానీ ఇతర అధికారులు మాత్రం ఆ విధంగా శిక్షలకు గురికాకుండా జాగ్రత్త పడలేకపోతున్నారు. తాజాగా ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు నాన్‍బెయిలబుల్ వారెంట్ ను ఏపీ హైకోర్టు జారీ చేసింది. అయితే సత్యనారాయణ ఐఏఎస్ అధికారి కాదు. ఐఆర్ఏఎస్ అధికారి. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటేషన్‌పై ఏపీకి వచ్చి పని చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలు మొత్తం ఆయనే చూస్తూంటారని చెబుతూంటారు.
గుడ్మార్నింగ్ సీఎం సార్ ఈ రోడ్డు చూశారా? జూలై 15 నుంచి జనసేన కొత్త ఉద్యమం !
ఈ క్రమంలో విద్యాశాఖకు చెందిన పనుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని చెల్లించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. గత విచారణ సమయంలో అధికారులు రావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కారణంగా ఆర్థిక శాఖ అధికారులు రావత్, రాజశేఖర్, సురేష్‍కుమార్ కోర్టుకువచ్చారు. అయితే సత్యనారాయణ మాత్రం రాలేదు. విద్యాశాఖ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని సీనియర్ లాయర్ అంబటి సుధాకర్‍రావు పిటిషనర్ తరపున వాదించారు.
హైకోర్టు ఎదుటకు అమరావతి స్టేటస్ రిపోర్ట్ - ఆగస్టు 2న మళ్లీ విచారణ !
ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి సత్యనారాయణ రాకపోవడంతో ఆయనకు నాన్‍బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. బిల్లుల చెల్లింపు విషయంలో ఆర్థిక శాఖ అధికారులు కొంత కాలంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి పనులు చేసిన వందల మంది కాంట్రాక్టర్లకు బిల్లులుచెల్లించడం లేదు. వారు తిరిగి తిరిగి వేసారి చివరికి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అన్ని శాఖల్లోనూ ఇలాంటి పిటిషన్లు ఉన్నాయి. కోర్టు ఆదేశిస్తున్నా కొన్ని చోట్లు బిల్లులు చెల్లించడం లేదు.
రావులపాలెం వివాదంలో ఎస్ఐ, సీఐ సస్పెండ్, నిరసన దీక్ష విరమించిన ఎమ్మెల్యే
గత నెలలో చిన్న చిన్న బిల్లులు కూడా చెల్లించకపోవడంతో సీఎఫ్ఎంఎస్ వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయమకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ కావడం ఏపీ అధికారుల్లో కొత్త కలకలానికి కారణం అవుతోంది.
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!
Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?
Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు
Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!
Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్