అన్వేషించండి

Nellore and Eluru Mayor Elections: ఈ 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు

Mayor Elections in Nellore and Eluru | నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Andhra Pradesh News | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఈ కీలక స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల నిర్వహణలో భాగంగా పారదర్శకతను పాటించాలని, సంబంధిత పాలకవర్గ సభ్యులకు, ఎక్స్ అఫీషియో సభ్యులకు ఈ నెల 20వ తేదీలోగా సమాచారం అందజేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి నెల్లూరు, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు, ఆయా నగరపాలక సంస్థల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను పంపింది.

నిర్ణీత షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల లేదా ఏవైనా ఇతర ఇబ్బందుల వల్ల ఆ రోజు సమావేశం నిర్వహించలేని పరిస్థితి తలెత్తితే, మరుసటి రోజు అంటే 27వ తేదీన తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలును సుసాధ్యం చేసేలా, బీసీల జనాభాపై లోతైన అధ్యయనం చేయడానికి ఒక డెడికేటెడ్ కమిషన్‌ను ప్రభుత్వం నియమించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడు లేదా రేపు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏకసభ్య కమిషన్‌ను నియమించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. 

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ఈ డెడికేటెడ్ కమిషన్‌గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రిజర్వేషన్ల ఖరారుకు అవసరమైన అధ్యయనాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ఈ కమిషన్‌కు 30 నుంచి 45 రోజుల గడువును ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బీసీల వెనుకబాటుతనాన్ని ఈ కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఈ అధ్యయనం కోసం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) డేటాను కమిషన్ ప్రామాణికంగా తీసుకోనుంది. ఈ సర్వే ద్వారా సేకరించిన గణాంకాలను విశ్లేషించి, రిజర్వేషన్ల అమలుపై కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Embed widget