అన్వేషించండి

Ys Sharmila: 'కడపలో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా?' - అవినాష్ పై షర్మిల తీవ్ర విమర్శలు, జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదన్న సునీత

AP Elections 2024: ప్రపంచమంతా కడప ఎన్నికల వైపు చూస్తోందని.. ఇక్కడి ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్, అవినాష్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

Ys Sharmila And Sunitha Election Campaign In Kadapa: కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఆమె గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్యాంపెయిన్ లో ఆమెతో పాటు వైఎస్ సునీత పాల్గొన్నారు. 'ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుంది. ఇక్కడ న్యాయం గెలుస్తుందా.?. నేరం గెలుస్తుందా.?. ప్రజలు న్యాయాన్ని గెలిపించాలి. ఓ వైపు వైఎస్ఆర్ బిడ్డ, ఇంకోవైపు వివేకా హత్య కేసు నిందితుడు. అవినాష్ రెడ్డి పదేళ్లు ఎంపీగా ఉండి.. కడప స్టీల్ గురించి పట్టింపు లేదు. కడప స్టీల్ YSR కల. ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారు. ఢిల్లీకి CBI కోసం పోతున్నాడు. ఇక్కడ ప్రజల కోసం ఒక్కనాడు పోలేదు. సీబీఐ ఆరోపణల ప్రకారమే మేము మాట్లాడుతున్నాం. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్, నగదు లావాదేవీలు అన్ని ఆధారాలున్నాయి. వివేకా జగన్ ను కొడుకులా చూశారు. అలాంటి బాబాయిని చంపితే హంతకులను కొడుకే కాపాడుతున్నారు. అరెస్ట్ చేయాలని చూస్తే అవినాష్ రెడ్డిని కర్నూలులో కాపాడారు. జగన్ కి అధికారం ఇచ్చింది అవినాష్ రెడ్డిని కాపాడటానికే. రాష్ట్ర ప్రజల కోసం కాదు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. ఒకప్పుడు నేను ఆన్న కోసం పాదయాత్ర చేశా. ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా.' అని షర్మిల పేర్కొన్నారు.
Ys Sharmila: 'కడపలో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా?' - అవినాష్ పై షర్మిల తీవ్ర విమర్శలు, జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదన్న సునీత

'జైల్లో ఉండే నాయకుడు వద్దు'
Ys Sharmila: 'కడపలో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా?' - అవినాష్ పై షర్మిల తీవ్ర విమర్శలు, జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదన్న సునీత

షర్మిల ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ వైఎస్ సునీత (Ys Sunitha).. అవినాష్ రెడ్డిపై విమర్శలు చేశారు. మనకు కడపలో ఉండే నాయకుడు కావాలని.. జైలులో ఉండే నాయకుడు కాదని అన్నారు. 'వివేకాను దారుణంగా హత్య చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం అవ్వొచ్చు. కానీ, ప్రజా తీర్పు చాలాపెద్దది. ప్రజా తీర్పు కోసం షర్మిల ఎంపీ గా పోటీ చేస్తున్నారు.  న్యాయం వైపు షర్మిల నిలబడ్డారు. అవినాష్ రెడ్డికి కనీసం ఓటు అడిగే పరిస్థితి లేదు. ఆయన రేపో మాపో జైలుకు పోతారు. మనకు కడపలో ఉండే నాయకుడు కావాలి. షర్మిలను గెలిపించి వివేకా ఆత్మ కి శాంతి కలిగించండి.' అని సునీత ప్రజలకు పిలుపునిచ్చారు.

'నవ సందేహాలు' పేరుతో మరో లేఖ

మరోవైపు, సీఎం జగన్ కు వైఎస్ షర్మిల 'నవ సందేహాలు' పేరుతో మరో లేఖ రాశారు. ఇటీవల పలు అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్న ఆమె.. తాజాగా మరో లేఖలో 9 ప్రశ్నలు సంధించారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టి వినోదం చూస్తున్నారని.. సంక్షేమ పథకాల సాకు చూపి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇంతటి ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం స్వతంత్ర భారతంలో మునుపెన్నడూ చూడలేదేమోనన్న ఆమె.. నిజంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద చిత్తశుద్ది ఉంటే, ప్రజలడిగే ఈ సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

నవ సందేహాలు

'1)  ‘బ్రాండ్‌ ఇమేజ్‌’ని గంగలో కలిపి, జనంపై ఓ వైపు పన్నుల వాత మరోవైపు అప్పుల మోత.. రూ.12 లక్షల కోట్ల రుణాలతో అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని అపకీర్తిపాలు చేసింది మీరు కాదా? 
2)  రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 2019-20లో 31.32 శాతంగా ఉన్న ప్రజారుణాలు (పబ్లిక్‌ డెబ్డ్స్‌) 2022 - 23 ఆర్థిక సంవత్సరం నాటికి 33.32 శాతానికి పెరగటం మీ చలువ కాదా?
3)  2020 నవంబరు నాటికే పరిమితిని మించి రాష్ట్రం అప్పులు తెచ్చుకుంటోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తో పాటు ‘క్రిసిల్‌’ వంటి సంస్థలు హెచ్చరించినా పరిస్థితిని ఎందుకు చక్కదిద్దలేకపోయారు.?
4) అన్నింటితో పాటు ఆస్తి పన్ను 45 శాతం పెంచారు. ఇంట్లో రోజూ పుట్టే చెత్తకు కూడా కొత్తగా పన్ను వేశారు. దేశంలో ఎక్కడా లేనట్టు పెట్రో ఉత్పత్తులపై మీ పన్ను కింద రూ.70 వేల కోట్లు అదనపు భారం మోపారు, ఇంకా ప్రజలు మిమ్మల్ని మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలి?
5) ఆర్థిక అనిశ్చితి, క్రమశిక్షణా రాహిత్యం వల్ల ఎక్కడా అప్పులు పుట్టని పరిస్థితి. కొత్త అప్పు తెస్తే తప్ప జీతాలివ్వలేని స్థితి! అప్పు కోసం వీలున్న ప్రతి తలుపునూ తడుతున్న దయనీయ స్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే మార్గం ఏముంటుందంటారు?
6)  రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న పన్ను రాబడి కాక పన్నేతర రాబడిని ఏ మాత్రం పెంచుకోకుండా, కేవలం అప్పులపైనే ఆధారపడటం, వివిధ పథకాల కింద కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా అడ్డగోలుగా దారి మళ్లించడం ఏ విధంగా గొప్ప పాలనో చెప్పగలరా ?
7) పంచాయతీ, మున్సిపల్‌ నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించడం రాజ్యాంగం 73, 74 సవరణల స్ఫూర్తికి విరుద్దం కాదా?
8) ఖజానాకు రావాల్సిన నిధుల్ని కార్పొరేషన్లకు మళ్లించి, FRMB పరిమితిని మించి అప్పులు తెచ్చి పుట్టబోయే పిల్లల నెత్తిన సైతం భారం మోపిన మిమ్మల్ని ప్రజలెందుకు క్షమించాలి?
9) ఎస్సీ - ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.లక్ష కోట్ల రూపాయల మేర దారి మళ్లించిన మిమ్మల్ని దళిత, గిరిజన బలహీనవర్గాల ప్రజలు ఎలా నమ్ముతారని మీరనుకుంటున్నారు?.' అంటూ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ 'నవ సందేహాలు'ను తీర్చిన తర్వాతనే రాష్ట్ర ప్రజానీకాన్ని ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. అంతవరకూ రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం జగన్ కు లేదని అన్నారు.

Also Read: Money Seized: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget