Raja Singh : "బుల్డోజర్ రాజాసింగ్"కు ఈసీ నోటీసులు - తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న ఎమ్మెల్యే !
బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్ల ఇళ్లు బుల్డోజర్లతో కూల్చేస్తామన్న వ్యాఖ్యలపై రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎమ్మెల్యే చెబుతున్నారు.
బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లతో తొక్కించేస్తామని యూపీ ఓటర్లను బెదిరించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ( Raja Singh ) ఎన్నికల సంఘం ( Election Commision ) నోటీసులు జారీ చేసింది. ఐపీసీ, ఆర్‌పీ చట్టం మరియు ఎన్నికల మోడల్ కోడ్ ( Election Code ) ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన రాజాసింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ( UP Assembly Elections ) ఎన్నికల ప్రచారాన్ని ఓ వీడియో ద్వారా చేశారు.
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి దోస్తానా ! టీ కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చినట్లేనా ?
హిందువులందరూ ఏకం కావాలి.. హిందువులంతా యోగి ఆదిత్యనాథ్‌కు ( Yogi Adityanadh ) ఓటు వేయాల్సిందేనని పిలుపునిచ్చాచ్చారు. ఒక వేల ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్‌కు ఓటు వేయనివారంతా ద్రోహులు అని.. వారికి ఉత్తర ప్రదేశ్‌లో ( UttarPradesh ) స్థానం లేదని హెచ్చరించారు. యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. యోగీకి ఓట్లు వేయనివారిని గుర్తిస్తామని.. ఇప్పటికే వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని ప్రకటించారు. బుల్‌డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో.. తెలుసా? యోగికి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఇంటికి వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలతో ఇళ్లను కూల్చి వేస్తామని ప్రకటించారు.
కేసీఆర్‌పై బీజేపీ "సర్జికల్ స్ట్రైక్" - ఆర్మీని కించపరిచారంటూ తీవ్ర విమర్శలు !
రాజా సింగ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఈ నోటీసులపై స్పందించిన రాజాసింగ్ తన వ్యాఖ్యలపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అఖిలేష్ ( Akhilesh ) ప్రభుత్వంలో మాఫియా రాజ్యం నడిచిందని..యోగి ప్రభుత్వం వచ్చాక ఆ మాఫియాను బుల్డోజర్లతో ఎత్తేశారని.. ఆ ఉద్దేశంతోనే తాను బుల్డోజర్ ( Buldozer ) వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాజా సింగ్ మరో వీడియో విడుదల చేశారు. ఈసీకి కూడా ఇదే సమాధానం పంపే అవకాశం ఉంది. అయితే ఈసీ రాజాసింగ్ సమాధానంతో సంతృప్తి చెందకపోతే కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తుంది.
మార్చి 3న వారణాశిలో పీపుల్స్ ఫ్రంట్ ఆవిర్భావం ? మెగా ర్యాలీ ప్లాన్ చేస్తున్న మమతా బెనర్జీ !