Congress Manifesto Punjab Polls: పంజాబ్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల- లక్ష ప్రభుత్వ ఉద్యోగాల హామీ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. యువత, మహిళల ఓట్లే లక్ష్యంగా హామీలు ఇచ్చింది.
![Congress Manifesto Punjab Polls: పంజాబ్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల- లక్ష ప్రభుత్వ ఉద్యోగాల హామీ Congress Releases Manifesto ahead Punjab Polls 2022 promises Rs 1100 Per Month To Women, 8 Gas Cylinders Congress Manifesto Punjab Polls: పంజాబ్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల- లక్ష ప్రభుత్వ ఉద్యోగాల హామీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/09/1797b8a6770141ed6a06bcee73b168d4_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజులు ఉందనగా ఈరోజు కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రైతుల పండించే నూనెగింజలు, మొక్కజొన్న, పప్పులను ప్రభుత్వమే సేకరిస్తుందని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ హామీ ఇచ్చారు.
The single point aim of Congress party is development of Punjab to its maximum.
— Punjab Congress (@INCPunjab) February 16, 2022
The 12 point agenda of upcoming Congress govt of Punjab will take care of the needs of each and every Punjabi.#CongressHiAyegi pic.twitter.com/4Ky97EisbF
మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాల కోసం కార్పొరేషన్లను ఏర్పాటుచేసి మాఫియాను అంతమొందిస్తామని సిద్ధూ అన్నారు. గృహిణులకు నెలకు రూ. 1100 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అంతేకాకుండా ఏడాదికి 8 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశారు.
అలాంటిదేం లేదు
సీఎం చరణ్‌జిత్ సింగ్ సిద్ధూతో తనకు విభేదాలు ఉన్నాయని వస్తోన్న వార్తలను అంతకుముందు సిద్ధూ ఖండించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌లో ఎలాంటి అంతర్గత యుద్ధం లేదన్నారు.
సీఎం అభ్యర్థి రేసులో చరణ్‌జిత్ సింగ్ చన్నీతో పాటు నవజోత్ సింగ్ సిద్ధూ కూడా బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీని ప్రకటిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Also Read: UP Election 2022: భాజపాను మళ్లీ గెలిపిస్తే మీ భూములు కూడా అమ్మేస్తారు: అఖిలేశ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)