అన్వేషించండి

Chitra Ramakrishna News: దేశం విడిచి పారిపోకుండా చిత్రా రామకృష్ణపై లుక్‌ఔట్‌ నోటీసులు.. మరో ఇద్దరి పైనా

NSE former CEO Chitra Ramakrishna News: చిత్రా రామకృష్ణపై విచారణ కొనసాగుతోంది. ఆమెతో పాటు మరో మాజీ సీఈవో రవి నారాయణ్, మాజీ సీవోవో ఆనంద్‌ సుబ్రహ్మణ్యం దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ (NSE) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణపై విచారణ కొనసాగుతోంది. అనేక అవకతవకలకు సంబంధించి సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్‌ ఫెసిలిటీకి అక్రమంగా యాక్సెస్‌ ఇచ్చిన కేసులో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా చిత్రతో పాటు మరో మాజీ సీఈవో రవి నారాయణ్, మాజీ సీవోవో ఆనంద్‌ సుబ్రహ్మణ్యం దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

లుక్‌ ఔట్‌ నోటీసులు

దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓపీజీ సెక్యూరిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌, యజమాని సంజయ్‌ గుప్తా, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. స్టాక్‌ మార్కెట్‌ను అందరికన్నా ముందుగా యాక్సెస్‌ చేసి లాభాలు గడించేలా ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్‌ ఫెసిలిటీలో అవినీతికి పాల్పడిన కేసులో అభియోగం మోపింది. అంతేకాకుండా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ, ఎన్‌ఎస్‌ఈలో గుర్తించని, తెలియని వ్యక్తులపైనా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తెలిపింది.

దిల్లీలోని మరో బ్రోకర్‌పై కేసు

'పైన పేర్కొన్న ప్రైవేటు కంపెనీ యజమాని, ప్రమోటర్‌ ఎన్‌ఎస్‌ఈలోని అజ్ఞాత అధికారులను ఉపయోగించుకొని ఎన్‌ఎస్‌ఈ సర్వర్‌ అర్కిటెక్చర్‌ను వాడుకున్నారు. అంతేకాకుండా కో లొకేషన్‌ ఫెసిలిటీని అందరికన్నా ముందుగానే యాక్సెస్‌ చేసేలా ముంబయిలోని ఎన్‌ఎస్‌ఈ అధికారులు కొందరు 2010-2012లో వారికి సహకరించారు. దీనివల్ల ఎక్స్‌ఛేంజీ సర్వర్‌లో మొదటే లాగిన్‌ అయి మిగతా బ్రోకర్లందరి కన్నా ముందుగానే సమాచారం తీసుకున్నారు' అని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.

చిత్రా రామకృష్టతో పాటు కొంతమంది అధికారులపై పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అయితే చిత్ర రామకృష్ణ.. ఎన్ఎస్​ఈ ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, డివిడెండ్​లకు సంబంధించిన విషయాలతో పాటు అంతర్గత సమాచారాన్ని ఓ యోగితో పంచుకున్నట్లు తేలింది.

ఆయన డైరెక్షన్‌లోనే

ఎన్‌ఎస్‌ఈకి సీఈవోగా ఉన్న సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలో ఏ పని చేయాలన్నా హిమాలయాల్లో ఉంటున్న ఓ యోగి ఆమోద ముద్ర పడితే కానీ చిత్రా ముందడుగు వేయలేదు.

ఎన్‌ఎస్‌ఈలో ఎవరిని నియమించాలి? ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి? వంటి విషయాలతో పాటు ఎన్‌ఎస్‌ఈ డివిడెంట్‌, ఆర్థిక ఫలితాల వివరాలు, బోర్డ్ మీటింగ్ ఎజెండా ఫైనాన్షియల్ డేటా మొత్తం ఆ గుర్తు తెలియని యోగి డైరెక్షన్‌లోనే జరిగాయి.

కలవకుండానే

ఆ యోగిని చిత్రా ఎప్పుడు కలవలేదు. మెయిల్‌ రూపంలోనే వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. చిత్రా ప్రశ్నలు అడగడం దానికి యోగి సమాధానాలు చెప్పడం.. ఇలా అన్నీ ఆ యోగి డైరెక్షన్‌లోనే సాగాయి. చిత్రా రామకృష్ణ ఎన్ఎస్​ఈకి 2013 ఏప్రిల్​ నుంచి 2016 డిసెంబర్​ వరకు ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget