UP Election 2022: భాజపాను మళ్లీ గెలిపిస్తే మీ భూములు కూడా అమ్మేస్తారు: అఖిలేశ్
భాజపాకు మళ్లీ అధికారం ఇస్తే రైతుల భూములు కూడా అమ్మేస్తారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మూడు నల్ల సాగు చట్టాలతో 750 మంది రైతుల చావులకు భాజపా కారణమైందని అఖిలేశ్ అన్నారు. మరోసారి వారికి అధికారం ఇస్తే రైతుల భూములు అమ్మేస్తారని విమర్శించారు.
మహిళలకు రక్షణ లేదు
ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అఖిలేశ్ అన్నారు.
403 స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 7 విడతల్లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న 58 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 14న 55 అసెంబ్లీ స్థానాలకు రెండో విడత పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 20న 59 స్థానాలకు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా, సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని యోగి యోచిస్తున్నారు. మరోవైపు తిరిగి అధికార పట్టాలు ఎక్కాలని సమాజ్‌వాదీ ప్రయత్నిస్తోంది.