Punjab Polls 2022: చన్నీకే ఛాన్స్.. పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన రాహుల్ గాంధీ
పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రకటించారు రాహుల్ గాంధీ.
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ ప్రకటించింది. నవజోత్ సింగ్ సిద్ధూతో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ చన్నీవైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది. పంజాబ్ లుథియానాలో జరిగిన బహిరంగ సభలో సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ ప్రకటించారు.
#WATCH | Congress leader Rahul Gandhi announces Congress' chief ministerial candidate for the upcoming Punjab Assembly elections 2022
— ANI (@ANI) February 6, 2022
"Punjab CM will come from a poor family, Chaani will be CM face for the upcoming Punjab Assembly elections," says Rahul Gandhi pic.twitter.com/SvnhvYAY3r
కృతజ్ఞతలు..
ఏదైనా ఓకే..
#WATCH | I have accepted Rahul Gandhi's decision...if I am given decision-making power, I will finish the mafia, improve people's lives. If not given power, I will walk with a smile with whomever you make CM: Punjab Congress president Navjot Singh Sidhu in Ludhiana pic.twitter.com/pS71BUBkhW
— ANI (@ANI) February 6, 2022
అంతకుముందు మాట్లాడిన సిద్ధూ.. కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని అన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు.
కీలక సమయంలో..
కెప్టెన్ అమరీందర్ సింగ్.. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత చన్నీ ఆ బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలలుగా ఆయన సీఎం పదవిలో ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే సీఎం చన్నీ మేనల్లుడు భూపేందర్ సింగ్ హనీని.. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. అయినప్పటికీ చన్నీపైనే కాంగ్రెస్ అధిష్ఠానం నమ్మకముంచింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీనే ప్రకటించింది.
Also Read: Assembly Elections 2022: షరతులతో కూడిన ఎన్నికల ప్రచారానికి ఈసీ ఓకే
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల సహా భాజపా కార్యక్రమాలు రద్దు.. ఇదే కారణం