అన్వేషించండి

Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?

Elkathurthi: ఎల్కతుర్తిలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు వేల కోళ్లను వదిలేశారు. వాటిని గ్రామస్తులు పట్టుకుని కూర వండేసుకున్నారు.

Unidentified people abandoned two thousand chickens in Elkathurthi: సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై శనివారం ఉదయం ఈ ఆసక్తికర ఘటన జరిగింది. కొందరు అజ్ఞాత వ్యక్తులు ఒక్కటి రెండు కాదు, సుమారు 2,000 నాటు కోళ్లను రోడ్డు మీద వదిలేసి దూరమయ్యారు. ఈ కోళ్లు ఒక్కసారిగా పొలాలు, రోడ్ల చుట్టూ కనిపించడంతో స్థానికులు  వాటిని పట్టుకునేందుకు పరుగులు పెట్టారు.  ఎవరో కోళ్లను వదిలిపెట్టారని తెలిసిన   గ్రామవాసులంతా వేటగాళ్లుగా మారారు.   చాకచక్యంగా కోళ్లను పట్టుకున్నారు. ఒక్కొక్కరు 2-3 కోళ్లతో సంతృప్తి చెందగా ..కొందరు పదుల సంఖ్యలో తీసుకువెళ్లారు.                            
 
దొరికిన కోళ్లను దొరికినట్లుగా తీసుకెళ్లి పండగ చేసుకున్నారు కానీ ఎందుకు వదిలేశారన్నది మాత్రం  ఎవరికీ తెలియదు. సాధారణంగా ఫారం కోళ్ల ధరలు కేజీ 250 ఉంటే..  నాటుకోళ్ల ధరలు కేజీకి 800 పైనే ఉంటాయి. మంచి రకానికి చెందినవి అయితే ఇంకా ఎక్కువ రేటు ఉంటాయి. అలాంటిది వ్యాపారులు రెండు వేల కోళ్లను అలా ఊరికే విడిచి పెట్టడం చిన్న విషయం కాదు. కొన్ని లక్షల రూపాయల విలువ ఉంటుంది. ఎంతో కష్టపడి వాటిని పెంచి ఉంటారు. ఎందుకు అలా వదిలి పెట్టారన్నది ఎవరూ తెలుసుకోలేదు.             

కోళ్లను విడిచిపెట్టడం అంటే.. వ్యాన్ లో తీసుకెళ్తూంటే పొరపాటున తలుపు విడిపోయి బయటపడి ఉండాలి. అలా పడి ఉంటే.. వెళ్లే వాళ్లకు తెలుస్తుంది. వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించేవారు. కానీ అలాంటి వారు ఎవరూ రాలేదు. తమ కోళ్లే అని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. అంటే వాటిని ఉద్దేశపూర్వకంగా ఎవరో వదిలి పెట్టి ఉంటారు. లక్షలు విలువైన కోళ్లను అలా ఊరికే వదిలేశారంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుందని చెప్పాల్సిన పని లేదని అంటున్నారు. సాధారణంగా కోళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.  వాటిని అమ్మకుండా.. ఇలా వదిలేసిపోయి ఉంటారన్న  అనుమానాలు కూడా ఉన్నాయి.                                  

కోళ్లను వేటాడి.. వెంటాడి మరి పట్టుకుని వండుకుని తిన్న ఎల్కతుర్తి గ్రామస్తులకు మాత్రం ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకు వదిలేశారో ఆలోచించలేదు. కానీ పోలీసులు మాత్రం ఈ మిస్టరీ ఏమిటో తేల్చాలని అనుకుంటున్నారు. కోళ్లలోడుతో వచ్చిన లారీలు, వాహనాల గురించి ఆరా తీస్తున్నారు. పొరపాటున ప్రజారోగ్యానికి  భంగం కలిగించేలా ఏమైనా అనారోగ్య పూరిత కోళ్లు ఏమైనా వదిలారోలేదో తెలుస్తుంది . లేకపోతే ఎందుకు వాడారో స్పష్టత వస్తుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HYDRA: రూ.18,000 కోట్ల విలువైన భూమి రికవరీ, బ‌తుక‌మ్మ‌కుంట ముమ్మాటికీ చెరువే: రంగనాథ్
రూ.18,000 కోట్ల విలువైన భూమి రికవరీ, బ‌తుక‌మ్మ‌కుంట ముమ్మాటికీ చెరువే: రంగనాథ్
CM Revanth Reddy: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
Kavitha Telangana Rakshana Sena:జాగృతి వేరు టీఆర్ఎస్ వేరు! తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు!
జాగృతి వేరు టీఆర్ఎస్ వేరు! తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు!
Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
Nani supports Pawan: పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
AP government teachers: గ్లోబల్ టీచర్స్.. గ్లోబల్ చదువు - సింగపూర్, ఫిన్లాండ్ విద్యా విధానాల పరిశీలనకు ఏపీ ఉపాధ్యాయులు !
గ్లోబల్ టీచర్స్.. గ్లోబల్ చదువు - సింగపూర్, ఫిన్లాండ్ విద్యా విధానాల పరిశీలనకు ఏపీ ఉపాధ్యాయులు !
Social Post : ట్రెడిషనల్ లుక్‌లో బేబమ్మ - ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ... వెకేషన్ ట్రిప్‌లో కియారా
ట్రెడిషనల్ లుక్‌లో బేబమ్మ - ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ... వెకేషన్ ట్రిప్‌లో కియారా
US Iran War: పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండరాదు, ఏ క్షణమైనా ఇరాన్‌పై సైనికచర్య: డొనాల్డ్ ట్రంప్
పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండరాదు, ఏ క్షణమైనా ఇరాన్‌పై సైనికచర్య: డొనాల్డ్ ట్రంప్
Jailer 2: రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ 
రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ 
Car Maintenance: కారులో AC వాడుతూ ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ ఖర్చులు మరింత పెరుగుతాయి జాగ్రత్త
కారులో AC వాడుతూ ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ ఖర్చులు మరింత పెరుగుతాయి జాగ్రత్త
Embed widget