అన్వేషించండి

Donga Police: ఇంత తెలివి తక్కువ దొంగ ఉంటాడా - పోలీసులకే సవాల్ చేశాడు - తర్వాత జరిగిందేమిటో చెప్పాల్సినపనిలేదు !

Eluru: దొంగలు పోలీసులకు సవాల్ చేయవచ్చా ?. ఈ దొంగకు జరిగిన సన్మానం చూస్తే అలాంటి ప్రశ్న కూడా దొంగలకు రాదు.

Eluru thief Arrest: వీధిలో గుండు సూది దొంగతనం  జరిగినా ఎవరు చేశారో రికార్డు పోలీసుల వద్ద ఉంటుంది. వాళ్లు పట్టుకోవాలనుకుంటే వాళ్లను ఎక్కడున్నా పట్టుకొచ్చేస్తారు. వారికి తీరిక లేక కొంత మంది దొంగల్ని పట్టుకోరు. ఇదేదో తమ ఘనత అనుకున ఓ దొంగ.. పోలీసులకు తాను ఎక్కడున్నారో తెలియదని  అనుకున్నాడు. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.

"నేను 100 బైకులు, స్కూటర్లు దొంగతనం చేశా.. దమ్ముంటే పట్టుకోండి" అంటూ  వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో వైరల్ అయింది.   నెటిజన్లు "పోలీసులు పట్టుకుంటారా?" అని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ, ఏలూరు పోలీసులు 'ఆపరేషన్ హంట్' పేరుతో రంగంలోకి దిగి, ఆ దొంగతో పాటు అతడి ముఠాలోని ఐదుగురు నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. వారి వద్ద నుంచి , 12 వాహనాలు  స్వాధీనం చేసుకున్నారు.                      

  ఏలూరు, తిరువూరు, ఆగిరిపల్లి, నూజివీడు  పల్లె ప్రాంతాల్లో సీసీటీవీలు లేకపోవడంతో దొంగలు సులభంగా బైకుల్ని దొంగతనం  చేస్తున్నారు.   పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, ఒక్కడి కాదు గ్యాంగ్ చేతిలో ఈ చోరీలు జరుగుతున్నాయని తేల్చారు. ఈ బైకుల దొంగల కోసం పోలీసులు వెదుకుతున్న సమయంలో ఒక దొంగ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. "నేను 100 బైకులు కొట్టేశా.. పోలీసులు పట్టుకోగలరా?" అంటూ పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

పాత కాలంలో ఇలాంటి కేసులు పోలీసులకు కష్టమే అయ్యేవి. మొబైల్‌లు, సోషల్ మీడియా లేకపోతే ఆధారాలు దొరకకపోయేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీతో పోలీసులు సులభంగా కేసులు సాల్వ్ చేస్తున్నారు.  వీడియో వైరల్ అవ్వడంతో ఏలూరు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. నూజివీడు టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. సత్య శ్రీనివాస్ అధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేశారు. జిల్లాలోని బైక్ చోరీ కేసులను పరిశీలించి, సీసీటీవీ ఫుటేజ్‌లను చెక్ చేశారు. పల్లె ప్రాంతాల్లో కెమెరాలు లేకపోవడం సవాలుగా ఉన్నా, టెక్నాలజీ , డిటెక్టివ్ వర్క్ మిక్స్ చేసి దర్యాప్తు చేశారు.

దర్యాప్తులో ఒక క్లూ ద్వారా ఈ చోరీలు ఒక్కడి చేత కాదు, గ్యాంగ్ చేత జరుగుతున్నాయని తేలింది. పక్కా ప్లాన్‌తో పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారిలో ఆ సవాలు విసిరిన దొంగ కూడా ఉన్నాడు. నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు.  పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 బైకులు, స్కూటర్ల విలువ రూ.9.08 లక్షలు. ఈ ఆపరేషన్ నూజివీడు ఎస్‌డీపీఓ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో విజయవంతమైంది. నిందితులు ఏలూరు, తిరువూరు, ఆగిరిపల్లి, నూజివీడు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు.       

పోలీసులు పోస్ట్ చేసిన వీడియోపై నారా లోకేష్ కూడా స్పందించారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Bandi Bhageerath Remand: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
Mouni Roy: విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
Brown Rice : బ్రౌన్ రైస్ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. వైట్ రైస్ కంటే ఎందుకు బెస్ట్ అంటే
బ్రౌన్ రైస్ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. వైట్ రైస్ కంటే ఎందుకు బెస్ట్ అంటే
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
Embed widget