Assembly Elections 2022: షరతులతో కూడిన ఎన్నికల ప్రచారానికి ఈసీ ఓకే
ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఈసీ ఎన్నికల ప్రచారంపై ఆంక్షలను సడలించింది.
దేశంలో కరోనా కేసులు తగ్గుతోన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి ఆంక్షలను కాస్త సడలించింది. బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులపై గతంలో విధించిన నిషేధం వర్తిస్తుందని పేర్కొంది.
ఆంక్షలు..
- ఇంటింటి ప్రచారంలో కేవలం 20 మందే పాల్గొనాలి. రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు ఎన్నికల ప్రచారంపై నిషేధం ముందులానే వర్తిస్తుంది.
- ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండోర్ సమావేశాలు నిర్వహించాలంటే.. ఆ హాలు సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది.
- ఓపెన్ గ్రౌండ్లో అయితే 30 శాతం మందితో మాత్రమే సమావేశం నిర్వహించాలి.
- బహిరంగ సభల్లో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.
- కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు చర్యలు కొనసాగించాలని రాష్ట్రాల అధికారులను ఆదేశించింది ఈసీ.
- ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొంతమందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో తొలి రెండు దశలకు అభ్యర్థులను ఆయా పార్టీలు ఖరారు చేశాయి. పార్టీ ప్రముఖలు, నేతల, మద్దతుదారుల ప్రచారానికి ప్లాన్స్ వేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈసీ ఆదేశాలు వాళ్లకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి.
ప్రస్తుతానికి పార్టీలు ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. వర్చువల్‌గా కూడా ఓట్లు అభ్యర్థిస్తున్నారు నేతలు.
ఐదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి కరోనా కేసులు పెరుగుతుండేవి. అందుకే అప్పట్లో బహిరంగ సభలు ర్యాలీలను ఎన్నికల సంఘం నిషేధించింది. ఫిబ్రవరి 11 వరకు నిషేధం విస్తూ ఉత్తర్వులు పొడిగించింది.
ఇప్పుడు కేసులు తగ్గుతున్నాయని సమీక్షలో తేలడంతో కొంత సడలింపు ఇచ్చింది. ఇంటింటి ప్రచారానికి ఇరవై మందిని అనుమతించింది. కొవిడ్ పరిస్థితిపై రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో చర్చించిన తర్వాత ఎన్నికల సంఘం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల సహా భాజపా కార్యక్రమాలు రద్దు.. ఇదే కారణం
Also Read: Asaduddin Owaisi Attack: 'మీరు ఒక్క ఓవైసీని చంపితే లక్షలాది మంది ఓవైసీలు పుడతారు'