అన్వేషించండి

Harish Vs Revanth Reddy : రుణమాపీపై రేవంత్ వర్సెస్ హరీష్ రావు పరస్పర సవాళ్లు - సై అంటారా ?

Telangana Politics : రుణమాఫీ హామీపై రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. రుణమాఫీ అమలు చేస్తే పార్టీని మూసేస్తారా అని బీఆర్ఎస్‌కు రేవంత్ సవాల్ చేశారు.

Telangana News :  తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు నెలల్లో   5 గ్యారంటీలను అమలు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు.  పంద్రాగస్టులోపు రైతురుణ మాఫీ చేస్తామని తెలిపారు. తాను బాధ్యత తీసుకున్న రోజు రూ. 3900 కోట్ల లోటు బడ్జెట్ ఉందని 5 నెలల్లో రూ. 26 వేల కోట్లు అప్పు కట్టానని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంటే ఆదుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు సవాల్ విసిరారు. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టు లోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం.. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతుండని మండిపడ్ారు  పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా?  ఈ సవాల్ కు హరీష్ సిద్ధమా..? అని ప్రశ్నించారు.  నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగు అని సవాల్ చేశారు. 

హరీష్ రావు ఏమన్నారంటే ? 

అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఎందుకు ఓడించాలో ప్రజల వద్ద వంద కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీపై మాట తప్పినందుకు, రైతు భరోసాపై మాట తప్పినందుకు, రూ.500 బోనస్‌పై మాట తప్పినందుకు, ఆసరా పెన్షన్లపై మాట తప్పినందుకు, మహిళలకు రూ.2,500 సాయం అందించనందుకు, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తామని మాట తప్పినందుకు, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు.. కాంగ్రెస్‌ను ఓడించాలి. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎందుకు చేయలేదు? ‘పంద్రాగస్టులోపు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తవా? రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా?’ అని సీఎం రేవంత్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. రైతుబంధు ఇవ్వని రేవంత్‌రెడ్డి.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తారా? అని ఎద్దేవా చేశారు. దేవుళ్లను ఆడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయటం తగదని సీఎంకు హితవు పలికారు. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని ఎవరి చెవుల్లో పువ్వులు పెడతావని ప్రశ్నించారు. డిసెంబర్‌ 9నే రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదని  ప్రశ్నించారు. 

కొడంగల్ లో రేవంత్ ఘాటు విమర్శలు 

కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానన్నారు. 33 వేల ఓట్ల మెజార్టీతో తనని గెలిపించారని తాను నామినేషన్ వేశాక ఒక్కసారి కూడా కొడంగల్ రాలేదని తెలిపారు. అయినా కొడంగల్ ప్రజలు తనని గుండెల్లో పెట్టుకుని చూశారని  పేర్కొన్నారు. కేసీఆర్‌లా తాను ఫామ్ హౌస్‌కు పరిమితమవ్వలేదని రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాలేదని కానీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి 5 సార్లు వచ్చానని అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. 70 ఏళ్లలో పాలమూరుకు ఎంతో అన్యాయం జరిగందన్నారు. కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్‌లో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కొడంగల్‌కు 5 వేల కోట్ల రూపాయల నిధుల తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 4 వేల కోట్ల రూపాయలతో మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చామని.. దీంతో లక్షా 30 వేల ఎకరాలకు నీటిని ఇస్తామని అన్నారు. కృష్ణా జలాలను అడ్డుకున్నది డీకే అరుణ అని ఫైర్ అయ్యారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget