News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

UP Election 2022 Predictions: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో మళ్లీ కమల వికాసం.. కానీ వెనుకే సైకిల్ రయ్‌రయ్‌!

త్వరలో జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో మరోసారి యోగి సర్కార్ కొలువుదీరే అవకాశం ఉందని ఏబీపీ- సీ ఓటర్ తాజా సర్వేలో తేలింది.

FOLLOW US: 
Share:

ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఏబీపీ న్యూస్, సీఓటర్ సంయుక్తంగా ఎన్నికల సర్వే నిర్వహించాయి. అసెంబ్లీ ఎన్నికల రేసులో ప్రస్తుతం ఎవరు రేసులో ముందున్నారో సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వచ్చాయి. అతిపెద్ద రాష్ట్రం కావడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. యోగినే మరోసారి సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి.

యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2022

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ న్యూస్, సీఓటర్ సంయుక్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. తాజాగా చేసిన సర్వేలో అత్యధికంగా బీజేపీకి 41.2 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి 35 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో వచ్చింది. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్‌ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. బీజేపీ 225 నుంచి 237 సీట్లతో యూపీలో మరోసారి అధికారంలోకి రానుందని ఏబీపీ, సీఓటర్ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోగా.. సమాజ్ వాదీ పార్టీ 139 నుంచి 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనుంది. 2017తో పోల్చితే ఎస్పీ చాలా మెరుగైంది. మాయావతి బీఎస్పీ మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేలా కనిపిస్తోంది. గతంలో 19 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 13 నుంచి 21 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ గతంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ 4 నుంచి 8 సీట్లతో సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుంది.

Also Read: ABP News-CVoter Survey: పంజాబ్‌ను ఊడ్చే దిశగా చీపురు.. మెజార్టీకి దగ్గరగా ఆమ్ ఆద్మీ !

Also Read: ABP News-CVoter Survey: దేవభూమిలో కాంగ్రెస్- భాజపా మధ్య హోరాహోరీ పోరు

Published at : 07 Feb 2022 08:29 PM (IST) Tags: BJP CONGRESS Abp live ABP News CVoter Survey Abp cvoter survey AAP SAD UP Election 2022 Punjab Election 2022 kaun banega mukhyamantri ABP CVoter Opinion Poll abp news live Assembly Election 2022 Uttarakhand Election 2022 Manipur Election 2022 ABP News Survey Goa elections 2022 ABP CVoter Opinion Poll Live KBM ABP Survey

ఇవి కూడా చూడండి

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Errabelli Dayakar Rao: అధైర్యపడొద్దు, కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఓటమి తర్వాత ఎర్రబెల్లి తొలి మీటింగ్

Errabelli Dayakar Rao: అధైర్యపడొద్దు, కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఓటమి తర్వాత ఎర్రబెల్లి తొలి మీటింగ్

Anantapur TDP politics : జేసీ పవన్ ఎక్కడ ? అనంతపురం ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ?

Anantapur TDP politics :   జేసీ పవన్ ఎక్కడ ?  అనంతపురం ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ?

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? అంచనాలు ఆయన అందుకుంటారా?

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? అంచనాలు ఆయన అందుకుంటారా?

టాప్ స్టోరీస్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!