ABP News-CVoter Survey: దేవభూమిలో కాంగ్రెస్- భాజపా మధ్య హోరాహోరీ పోరు
ABP-సీ ఓటర్ చేసిన ఒపినీయన్ పోల్ ప్రకారం.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా మధ్య నువ్వా-నేనా అనేలా పోటీ నెలకొంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీఓటర్ సర్వే చేసింది. తాజా ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్-భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరి పూర్తి ఫలితాలు మీరే చూడండి.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP-సీ ఓటర్ చేసిన ఒపినీయన్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భాజపా 31- 37 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 30-36 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఆమ్‌ఆద్మీకి 2-4 స్థానాలు గెలవొచ్చు.
ఉత్తరాఖండ్‌లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి భాజపా, కాంగ్రెస్ మధ్య అధికారం దోబూచులాడుతోంది. మరి ఫిబ్రవరి 14న జరగనున్న తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించనుంది. ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు ఒక విడతలోనే జరగనున్నాయి.
గత సర్వేలో..
70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా 31-37 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని గత సర్వేలో తేలింది. కాంగ్రెస్‌కు 31-36 స్థానాలు దక్కే అవకాశం ఉంది. స్పష్టమైన ఆధిక్యం ఎవరు సాధిస్తారనేది చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే మేజిక్ ఫిగర్ 35 కాగా ఆమ్‌ఆద్మీకి కూడా 2-4 స్థానాలు దక్కే అవకాశం లేకపోలేదు. దీంతో ఆప్ కింగ్ మేకర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read: ABP News-CVoter Survey: పంజాబ్‌ను ఊడ్చే దిశగా చీపురు.. మెజార్టీకి దగ్గరగా ఆమ్ ఆద్మీ !
Also Read: ABP News-CVoter Survey: దేవభూమిలో కాంగ్రెస్- భాజపా మధ్య హోరాహోరీ పోరు