Exams Postponed: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. ఈ నగరల్లో యూజీసీ-నెట్, ఐఐఎఫ్ టీ పరీక్షలు వాయిదా
జవాద్ తుపాను కారణంగా పలు నగరాల్లో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు తదుపరి తేదీలను ఎన్టీఏ త్వరలో ప్రకటిస్తుంది.
![Exams Postponed: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. ఈ నగరల్లో యూజీసీ-నెట్, ఐఐఎఫ్ టీ పరీక్షలు వాయిదా ugc net iift exam deferred in some centres amidst threat of cyclone jawad Exams Postponed: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. ఈ నగరల్లో యూజీసీ-నెట్, ఐఐఎఫ్ టీ పరీక్షలు వాయిదా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/21c3d4d7bd2c59734d08970b385e5dd3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జవాద్ తుపాను కారణంగా పలు పరీక్షలు.. కొన్ని నగరాల్లో వాయిదా పడ్డాయి. 'జవాద్' తుపాను దృష్ట్యా.. పలు నగరాల్లో జరగాల్సిన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET) మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( ఐఐఎఫ్ టీ) అడ్మిషన్ టెస్ట్ వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని పలు నగరాల్లో వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసిన నోటీసు ప్రకారం.. విశాఖపట్నం, పూరీ, భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాలోని బెర్హంపూర్ మరియు రాయగడ జిల్లాలోని గుణుపూర్‌లోని కేంద్రాల్లో యూజీసీ నెట్ 2020, జూన్ 2021 పరీక్షలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 4న జరగాల్సిన ఈ పరీక్షలు డిసెంబర్ 5కి వాయిదా వేశారు. తెలుగు, కార్మిక సంక్షేమం, వ్యక్తిగత నిర్వహణ, పారిశ్రామిక సంబంధాలు తదితర సబ్జెక్టుల పరీక్షలు డిసెంబర్ 5న ఉంటాయి.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, దుర్గాపూర్, ఒడిశాలోని భువనేశ్వర్, కటక్, సంబల్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ)లో ఎంబీఏ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను సైతం జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. మెుదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5న పరీక్ష జరగాల్సి ఉంది. తుపాను కారణంగా వాయిదా వేశారు.
పైన చెప్పిన నగరాల్లోని పరీక్షా కేంద్రాల్లో దరఖాస్తుదారులకు పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తామని ఎన్టీఏ చెప్పింది. అయితే పరీక్షల వాయిదా.. ఎన్టీఏ పేర్కొన్న స్థానాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరుగతుందని అభ్యర్థులకు సమాచారం వెళ్లింది.
అప్‌డేట్‌లు మరియు సమాచారం కోసం www.nta.ac.in ఎన్టీఏ వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ఏవైనా సందేహాలుంటే 00140459000లో హెల్ప్‌డెస్క్‌ని సంప్రదించవచ్చు. ugc.net@nta.ac.inకి ఇ-మెయిల్ పంపొచ్చు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 'జవాద్' తుపానుగా మారిందని శుక్రవారం నాడు.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతాన్ని తాకుతుందని వెల్లడించింది. అక్కడి నుంచి ఉత్తర- ఈశాన్యం దిశగా పయనించి.. డిసెంబరు 5 మధ్యాహ్నం నాటికి పూరీలో తీరం దాటుతుందని పేర్కొంది.
Also Read: ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)