UGC Online Courses: ఆన్‌లైన్‌లో మూడు కొత్త 'స్వయం' కోర్సులు ప్రవేశపెట్టిన యూజీసీ! జనవరి సెషన్ నుంచే అందుబాటులో!
బౌద్ధ సంస్కృతికి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా పునరుద్ధరించేందుకు ఈ మూడు కోర్సులు దోహదపడతాయని యూజీసీ పేర్కొంది. భారతీయ బౌద్ధమత చరిత్ర, అభిదమ్మ(పాలి), బౌద్ధతత్వ శాస్త్రం కోర్సులు అందుబాటులోకి..
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) మూడు మూక్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వయం ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో వీటిని జనవరి నుంచి విద్యార్థులు వినియోగించుకోవచ్చు. బౌద్ధ సంస్కృతికి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా పునరుద్ధరించేందుకు ఈ మూడు కోర్సులు దోహదపడతాయని యూజీసీ పేర్కొంది. భారతీయ బౌద్ధమత చరిత్ర, అభిదమ్మ(పాలి), బౌద్ధతత్వ శాస్త్రం కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. వీటితోపాటు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, సామాజిక బాధ్యత కోర్సులను అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. ఈ కోర్సులను విద్యార్థులు అభ్యసించేలా ఉన్నత విద్యా సంస్థలు ప్రోత్సహించాలని యూజీసీ సూచించింది.
కంప్యూటర్ సైన్స్‌లో ‘బీఎస్సీ ఆనర్స్' డిగ్రీ, ఈ ఏడాది నుంచే అమల్లోకి!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సును అందుబాటులోకి తేనున్నారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచే కళాశాలల్లో హానర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. జనవరి 20న హైదరాబాద్‌లోని విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. రెండేళ్ల క్రితం తొలిసారిగా పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల (ప్రస్తుతం మహిళా విశ్వవిద్యాలయం), బేగంపేట మహిళా, సిటీ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. తాజాగా బీఎస్సీకి కూడా ఆనర్స్‌ను విస్తరించారు. మూడేళ్ల వ్యవధి గల ఈ కోర్సులో కంప్యూటర్ సైన్స్ కేంద్రీకృతంగా సిలబస్ ఉంటుంది.
13 ప్రాంతీయ భాషల్లో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు!
వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష మరో 13 భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఈ పరీక్ష కేవలం హిందీ, ఆంగ్లంలో నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. భాష కారణంగా ఎవరూ అవకాశాలు కోల్పోవద్దని ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు హిందీ, ఆంగ్లంతో పాటు ఉర్దూ, తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోనూ ఎస్‌ఎస్‌స్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న మిగతా భాషలనూ పరీక్షలో క్రమంగా చేర్చుతాం. దీనివల్ల చాలా మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నామని జితేంద్ర సింగ్ వెల్లడించారు.
'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్!
ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను వివిధ స్కాలర్‌షిష్‌ల కోసం డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది.
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..