ONGC Scholarships: 'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్!
జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి.
![ONGC Scholarships: 'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్! ONGC Scholarships for OBC, OC, SC, ST Category degree Students academic year 2021-2022 ONGC Scholarships: 'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/19/1cb8e645bb64bcbd1664f022071fc1741674146993458522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను వివిధ స్కాలర్‌షిష్‌ల కోసం డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది.
వివరాలు...
* ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ స్కీం 2021-22
స్కాలర్‌షిప్స్ సంఖ్య: 2000
1) ఎస్సీ/ఎస్టీ స్కాలర్‌షిప్స్: 1000
2) ఓబీసీ స్కాలర్‌షిప్స్: 500
3) జనరల్/ఈడబ్ల్యూఎస్ స్కాలర్‌షిప్స్: 500
అర్హతలు..
➥ డిగ్రీ స్కాలర్‌షిప్స్‌కు ఇంటర్‌లో 60 శాతం మార్కులు, పీజీ స్కాలర్‌షిప్స్‌కు డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలి.
➥ ఇంజినీరింగ్/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. స్కాలర్‌షిప్‌ల్లో మహిళ అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.
స్కాలర్‌షిప్: ఏటా రూ.48000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరి తేది: 06.03.2023.
Notification & Online Applicatiion
Also Read:
డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్! ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి!
సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీ, సైబర్ లాపై అవగాహనను కల్పించేలా డిగ్రీలో కొత్త సబ్జెక్టును తేనున్నారు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలో డిగ్రీలోని అన్ని గ్రూపుల్లో ఈ సబ్జెక్టును తప్పనిసరిగా చదివేలా ప్రవేశపెట్టనున్నారు. మొదటి సంవత్సరంలో ఒక్కో సెమిస్టర్‌కు రెండు క్రెడిట్‌లు ఉండనున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీ అంశంపై గురువారం (జనవరి 19) ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాఠ్యాంశం రూపకల్పనకు సంబంధించి 10 మంది నిపుణులతో కూడిన సిలబస్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'స్కాలర్‌షిప్' దరఖాస్తుకు ఇక కొద్దిరోజులే గడువు, దరఖాస్తుకు 3 లక్షల మంది దూరం! మరోసారి పొడిగిస్తారా?
తెలంగాణలో విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌కు సంబంధించిన కొత్త దరఖాస్తు, రెన్యూవల్ గడువు జనవరి 31తో ముగియనుంది. దరఖాస్తుకు మరో 13 రోజులే గడువు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గడువు సమీపిస్తున్నా.. ఇప్పటికీ 3 లక్షల మంది దరఖాస్తుకు దూరంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. కొత్త విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోకుండా ఉండిపోయారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 'టీజీ యూజీసెట్'! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్-23 ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి. అర్హులైన విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నవారు, 2022 మార్చిలో ఇంటర్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)