అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Cyber Security: డిగ్రీలో సైబర్‌ సెక్యూరిటీ సబ్జెక్ట్! ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి!

సైబర్‌ సెక్యూరిటీ, సేఫ్టీ, సైబర్‌ లాపై అవగాహనను కల్పించేలా డిగ్రీలో కొత్త సబ్జెక్టును తేనున్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో డిగ్రీలోని అన్ని గ్రూపుల్లో ఈ సబ్జెక్టును తప్పనిసరి చేయనున్నారు.

టెక్నాలజీ పెరిగే కొద్ది.. టెక్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆర్థిక మోసాలు, బ్లాక్‌మెయిలింగ్‌ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఇలాంటి మోసాలు, నేరాలు ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో విద్యార్థి దశ నుంచే సైబర్‌ నేరాలపై అవగాహన పెంచడం ద్వారా నేరాలను అదుపుచేయొచ్చనే ఉద్ధేశ్యంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటిపై విద్యార్థులకు అవగాహన పెంచేలా డిగ్రీ కోర్సుల్లో సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సేఫ్టీని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

సైబర్‌ సెక్యూరిటీ, సేఫ్టీ, సైబర్‌ లాపై అవగాహనను కల్పించేలా డిగ్రీలో కొత్త సబ్జెక్టును తేనున్నారు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలో డిగ్రీలోని అన్ని గ్రూపుల్లో ఈ సబ్జెక్టును తప్పనిసరిగా చదివేలా ప్రవేశపెట్టనున్నారు. మొదటి సంవత్సరంలో ఒక్కో సెమిస్టర్‌కు రెండు క్రెడిట్‌లు ఉండనున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో సైబర్‌ సెక్యూరిటీ, సేఫ్టీ అంశంపై గురువారం (జనవరి 19) ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాఠ్యాంశం రూపకల్పనకు సంబంధించి 10 మంది నిపుణులతో కూడిన సిలబస్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు.

విద్యార్థులు సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందకు వారిలో అవగాహనను కల్పించేలా ఈ కమిటీ సిలబస్‌ను రూపొందించనుంది. 2023-24 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో తప్పనిసరిగా ఇదొక సబ్జెక్టును విద్యార్థులు చదివేలా యూనివర్సిటీ, కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా నేరాలను అదుపుచేయొచ్చని ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు.

Also Read:

జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు!
జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 28, 29, 30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అయితే జనవరి 28న మాత్రం కేవలం సెకండ్ షిఫ్ట్ (పేపర్-2ఎ, 2బి) పరీక్ష మాత్రమే నిర్వహించనున్నారు. మిగతా పరీక్షల షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'స్కాలర్‌షిప్' దరఖాస్తుకు ఇక కొద్దిరోజులే గడువు, దరఖాస్తుకు 3 లక్షల మంది దూరం! మరోసారి పొడిగిస్తారా?
తెలంగాణలో విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌కు సంబంధించిన కొత్త దరఖాస్తు, రెన్యూవల్ గడువు జనవరి 31తో ముగియనుంది. దరఖాస్తుకు మరో 13 రోజులే గడువు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గడువు సమీపిస్తున్నా.. ఇప్పటికీ 3 లక్షల మంది దరఖాస్తుకు దూరంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. కొత్త విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోకుండా ఉండిపోయారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

తెలంగాణ 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
ప్రవేశ ప్రకటన, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget