అన్వేషించండి

జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు!

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 28, 29, 30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే జనవరి 28న మాత్రం కేవలం సెకండ్ షిఫ్ట్ (పేపర్-2) పరీక్ష మాత్రమే నిర్వహించనున్నారు.

జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 28, 29, 30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అయితే జనవరి 28న మాత్రం కేవలం సెకండ్ షిఫ్ట్ (పేపర్-2ఎ, 2బి) పరీక్ష మాత్రమే నిర్వహించనున్నారు. మిగతా పరీక్షల షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా 290 నగరాల్లో, దేశం బయట 25 నగరాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వెబ్‌సైట్‌లో ఇంటిమేషన్ స్లిప్స్‌ను అందుబాటులో ఉంచింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కూడా జనవరి 19 లేదా 20న విడుదల చేయనుంది.

ఎన్టీఏ అధికారిక ప్రకటన ఇలా..
“National Testing Agency is conducting the Joint Entrance Examination (Main) – 2023 Session 1 at different Centres located in 290 cities throughout the country and 25 Cities outside India on 24, 25, 29, 30 , 31 January and 1 February 2023 for B.E./B.Tech (Paper I, Shift 1st & Shift 2nd ) and 28 January (2nd Shift only) for B.Arch and B.Planning (Paper 2A & Paper 2B),”

జేఈఈ మెయిన్ 2023 పరీక్షల షెడ్యూలు..
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో జేఈఈ మెయిన్ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించనుంది. తొలి విడత పరీక్షలను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో; రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్షకు డిసెంబరు 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 

➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

మాక్ టెస్టులు అందుబాటులో..
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో NTA టెస్ట్-ప్రాక్టీస్ సెంటర్‌లు మూసివేయడంతో, అభ్యర్థులు వారి ఇళ్ల నుంచే మాక్ టెస్టులు ప్రాక్టీసు చేసేందుకు వీలుగా ఎన్టీఏ ఈ యాప్‌ను ప్రారంభించింది. అభ్యర్థులు నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మాక్ టెస్ట్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ 'Google' ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. iOS ప్లాట్‌ఫారమ్‌లలో కూడా యాప్ అందుబాటులో ఉంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
WhatsApp GhostPairing scam: వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
Shambhala Trailer : సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
Shubman Gill: శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!

వీడియోలు

Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే
Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
WhatsApp GhostPairing scam: వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
Shambhala Trailer : సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
Shubman Gill: శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
World Bank Loan For Pakistan: పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
TVS తొలి అడ్వెంచర్‌ బైక్‌ Apache RTX 300: నిజ జీవితంలో ఎంత మైలేజ్‌ ఇస్తుందంటే?
TVS Apache RTX 300 మైలేజ్‌ టెస్ట్‌: సిటీలో, హైవేపైనా అదరగొట్టిన తొలి అడ్వెంచర్‌ బైక్‌
Embed widget