News
News
X

TSWRES Admissions: గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం చదువుతున్న బాలురు దరఖాస్తు చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపికలు ఉంటాయి.

వివరాలు..

సైనిక పాఠశాల ప్రవేశాలు - 6వ తరగతి (సీబీఎస్ఈ)

సీట్ల సంఖ్య: 80 

సీట్ల కేటాయింపు: ఎస్సీ- 60, బీసీ(సి)- 02, ఎస్టీ- 05, బీసీ- 10, మైనార్టీ- 02, ఓసీ/ ఈబీసీ- 01.

అర్హతలు: 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం చదువుతున్న బాలురు దరఖాస్తు చేసకోవచ్చు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000కు మించకూడదు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.04.2023 నాటికి 11 సంవత్సరాలకు మించకూడదు. 01.04.2012 నుంచి 31.03.2014 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో 100 మార్కులకు రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష, రెండో దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాతి దశలో ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ (డిస్క్రిప్టివ్), కమ్యూనికేషన్ స్కిల్ టెస్టు, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.02.2023.

➥ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్: 17.02.2023 నుంచి.

➥ ప్రవేశ పరీక్షతేది: 26.02.2023.

➥ రాత పరీక్ష ఫలితాలు: 08.03.2023.

➥ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేదీలు: 20, 22, 24, 25, 26.03.2023.

➥ తుది ఫలితాల ప్రకటన: 28.03.2023.

➥ పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభం: 30.03.2023.

Notification

Online Application

Website

                                                   

Also Read:

తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 'తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2023-2024 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 204 మైనార్టీ పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 107 బాలుర పాఠశాలలు ఉండగా, 97 బాలికల పాఠశాలలు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!

తెలంగాణ 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! వివరాలు ఇలా!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 02 Feb 2023 07:42 PM (IST) Tags: Telangana Social Welfare Residential Sainik School Karimnagar Sainik School admissions TSWRES Admissions Karimnagar Sainik School 6th class admissions TS Sainik School Admissions

సంబంధిత కథనాలు

CUET (PG) - 2023: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

CUET (PG) - 2023: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సీయూఈటీ (పీజీ) పరీక్ష షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

సీయూఈటీ (పీజీ) పరీక్ష షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

IITD Admissions: ఐఐటీ ఢిల్లీలో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు, వివరాలు ఇలా!

IITD Admissions: ఐఐటీ ఢిల్లీలో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?

TS Paper Leak Politics :

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!