News
News
X

TS ICET Counselling: నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్, ఈ డాక్యుమెంట్లు రెడీగా ఉన్నాయా లేదా !

అక్టోబరు 8 నుంచి 12 వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 10 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభంకానుంది. అక్టోబరు 13 వరకు అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు.

FOLLOW US: 
 

టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శ‌నివారం (అక్టోబరు 8) నుంచి ప్రారంభం కానుంది. ఐసెట్ ప్రవేశ ప‌రీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంద‌రూ అక్టోబరు 8 నుంచి 12 వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 10 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభంకానుంది. అక్టోబరు 13 వరకు అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు అక్టోబర్‌ 10 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడత‌ సీట్లు కేటాయించనున్నారు. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు.. అక్టోబరు 18 నుంచి 21 మ‌ధ్య సంబంధింత కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


అక్టోబరు 23 నుంచి తుది విడత కౌన్సెలింగ్..

అక్టోబరు 23 నుంచి ఐసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబ‌ర్ 23 నుంచి 25 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లకు అవ‌కాశం క‌ల్పించారు. అక్టోబరు 28న తుది విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబరు 28 నుంచి 30లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. న‌వంబ‌ర్ 1 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభమవుతాయి.


Also Read:  జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?

News Reels

 

TS ICET 2022 కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

✦ TS ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్, tsicet.nic.inకి వెళ్లండి.

✦ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి.

✦ రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ చేయండి.

✦ అవసరమైన వివరాలను నింపాలి.

✦ బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ఎంచుకోవాలి.

✦ ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.

✦ సేవ్ చేసిన ఎంపిక ప్రక్రియను ప్రింట్ తీసుకుని.. లాగ్ అవుట్ చేయండి.


Also Read:  EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!

 

ఈ ఏడాది పరీక్ష జులై 27, 28 తేదీల్లో మొత్తం నాలుగు సెషన్లలో ఐసెట్-2022 పరీక్ష నిర్వహించిన విష‌యం తెలిసిందే. తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 4 కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించారు. ఐసెట్ పరీక్షకు తెలంగాణ, ఏపీల్లో కలిపి 90.56 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కోసం 75,952 మంది దరఖాస్తు చేసుకోగా 68,781 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 7,171 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 61,613 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 89.58 శాతం ఉత్తీర్ణులయ్యారు.


కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు ఇదే..

♦ అక్టోబరు 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్

♦ అక్టోబరు 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

♦ అక్టోబరు 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు

♦ అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్ల కేటాయింపు

అక్టోబరు 23 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం

♦ అక్టోబరు 23న స్లాట్ బుకింగ్

♦ అక్టోబరు 23న ధ్రువపత్రాల పరిశీలన

♦ అక్టోబరు 23 నుంచి 25 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు

♦ అక్టోబరు 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు

♦ అక్టోబరు 28న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల

TS ICET - 2022 Counselling Notification 

Counselling Website

 

సర్టిఫికేట్ల పరిశీలనకు అవసరమైన డాక్యుమెంట్లు:

 

Also Read:  జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?

 

ICET - ఈ కోర్సులతో ఉత్తమ భవిత:

ఎంసీఏ:
ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఎంసీఏ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందుకు మ్యాథ్స్ పై పట్టు ప్రాక్టికల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగాన్నే ఎంచుకోవచ్చు. ఇందులో ఎక్కువ టెక్నాలజీతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దానిపై అవగాహన అధ్యయనం చేయగలగాలి. ప్రస్తుతం మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. ఎంసీఏ పూర్తి చేసుకున్న వారికి ప్రధానంగా ఉపాధి కల్పించేది సాఫ్ట్ వేర్ రంగమే. ఈ కోర్స్ లో చేరినప్పటి నుంచే ప్రోగ్రామింగ్, నైపుణ్యాలపై దృష్టి సారించాలి. ఈ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.

జాబ్ మార్కెట్లో బీటెక్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కావల్సిన నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,బ్లాక్ ఛైన్ టెక్నాలజీ, ఆటోమేషన్, రోబోటిక్స్ తదితర టెక్నాలజీల ముందు వరుసలో నిలుస్తాయి. పరిశ్రమలకు అనుగుణంగా ఆర్ ప్రోగ్రామింగ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం అవసరం. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైతే మంచి జీతంతో పాటు చక్కటి కెరీర్ను పొందవచ్చు.

 

Also Read:  DOT: టెలికమ్యూనికేషన్ శాఖలో ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలు ఉండాలి!


ఎంబీఏ
:
నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న కోర్సుల్లో ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) మొదటి మూడు స్థానాల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ కోర్సు చేయడం వల్ల కార్పొరేట్ రంగంలోని కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంపై ఆసక్తితో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఇందులో త్వరగా రాణిస్తారు. బిజినెస్ స్కిల్స్, టీం మేనేజ్‌మెంట్, టీమ్ లీడింగ్ సామర్థ్యం, ప్రణాళిక, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడం, బృందా పనితీరును మెరుగు పరిచే ఎలా తీర్చిదిద్దడం, సమస్యలు వచ్చినప్పుడు కారణాలు అన్వేషించి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎంబీఏ పూర్తి చేసిన వారు బిజినెస్ మేనేజర్లు, సీఈఓ, అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్ గా మారవచ్చు.

ఎంబీఏలో మార్కెటింగ్, హెచ్ఆర్ ,ఫైనాన్స్ తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. ఈ కోర్సు రాణించాలంటే కేస్ స్టడీలను పరిశీలించాలి. అంతేకాకుండా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లిష్ భాషపై పట్టు మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై ప్రత్యేక ప్రావీణ్యం సంతరించుకోవడంతో పాటు, ప్రాజెక్ట్‌వర్క్ చేయాలి. కార్పొరేట్ రంగంలో ఎందుకు వ్యక్తిగత చొరవ కూడా ఉండాలి.


Also Read:  BPCL: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు, వీరికి అవకాశం!


ప్రతి సంవత్సరం ఎంబీఏ పూర్తి చేసుకొని పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం కొందరికే లభిస్తున్నాయి. ఎందుకంటే దీని సరిపడా నైపుణ్యాలు కొంతమంది లోనే ఉంటున్నాయి. కాబట్టి అలా నేర్చుకునే వారికి న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అలా నేర్చుకున్నవారికి బ్యాంకింగ్, ఫార్మ్, అగ్రికల్చర్, ఇన్సూరెన్స్ ,హెల్త్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలు లభిస్తాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 08 Oct 2022 09:39 AM (IST) Tags: Education News TS ICET 2022 Counselling Dates ICET 2022 Counselling Schedule ICET Counselling Dates ICET Counselling Notification TSICET WEB Counselling

సంబంధిత కథనాలు

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

తెలంగాణ ఎడ్‌సెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి!

తెలంగాణ ఎడ్‌సెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి!

AP LAWCET: డిసెంబరు 3 నుంచి 'ఏపీ లాసెట్‌-2022' కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP LAWCET: డిసెంబరు 3 నుంచి 'ఏపీ లాసెట్‌-2022' కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?