EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!
ఇఫ్లూలో ప్రవేశాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
![EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి! EFLU invited applications for admissions in to part-time courses in foreign languages for the Academic Year 2022-2023 EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/03/e58f8c02e061540b02d71b8e7e1633a11664790979061522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) 2022-2023 విద్యా సంవత్సరానికి వివిద విదేశీ భాషల్లో పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల వివరాలు..
1) సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫీషియన్సీ కోర్సు
విభాగాలు: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్.
2) డిప్లొమా కోర్సులు
విభాగాలు: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, చైనీస్, కొరియన్, పర్షియన్.
3) అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు
విభాగాలు: అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, జపనీస్, కొరియన్, పర్షియన్.
4) డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్
విభాగాలు: అరబిక్.
కోర్సు వ్యవధి: రెండు సెమిస్టర్లు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.50. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ప్రవేశ పరీక్ష ఫీజు: రూ.200. ఎస్సీ/ ఎస్టీల అభ్యర్థులకు రూ.100. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
అర్హత: పదోతరగతి తదితర విద్యార్హతలు ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.10.2022.
Notification
Online Application
Website
Also Read:
జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?
విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో గడువు ముగియగా.. మరో నెలపాటు పెంచారు. పేద విద్యార్థులకు పెద్ద చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం దరఖాస్తు గడువు ముగిసేనాటికి 392 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో మరింత మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అక్టోబరు 30 వరకు పొడిగించారు. ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
NMMS: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, అందుబాటులో వెబ్‌సైట్!
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ సెప్టెంబరు 27న విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఇదివరకే ప్రకటించిన షెడ్యూలు మేరకు ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబరు 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 18న మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. అభ్యర్థులు అక్టోబరు 18 నుంచి 21 వరకు ట్యూషన్ ఫీజు, కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)