News
News
X

TS SET 2022: టీఎస్ సెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా!

డిసెంబరు 30 నుంచి టీఎస్ సెట్ 2022 ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2022 నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

చివరిసారిగా 2019లో సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు సెట్ నిర్వహించలేదు. తాజాగా టీఎస్‌సెట్-2022 నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో ఆన్‌లైన్ ద్వారా టీఎస్ సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

టీఎస్ సెట్-2022 (TS SET-2022)

సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

పరీక్ష ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాలి.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష (టీఎస్ సెట్) ద్వారా.

పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

పరీక్ష సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, విజయవాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు..

➥ TS-SET-2022 నోటిఫికేషన్ (ప్రెస్‌నోట్): 23-12-2022.

➥ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30-12-2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది (ఆలస్యరుసుము లేకుండా): 20-01-2023. 

➥ రూ.1500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25-01-2023.

➥ రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 31-01-2023.

➥ రూ.3000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది:  05-02-2023.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 2023, ఫిబ్రవరి 6, 7 తేదీల్లో.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : 2023, ఫిబ్రవరి చివరివారంలో. 

➥ పరీక్ష తేది: 2023, మార్చి మొదటి లేదా రెండోవారంలో. 

Notification
Website 

Also Read:

టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశాలు, కోర్సుల వివరాలు ఇలా!
టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. టిస్  ముంబయి క్యాంపస్‌లో 38, హైదరాబాద్‌లో 10, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2023 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2023 నోటిఫికేషన్‌ గురువారం (డిసెంబరు 22) విడుదలైంది. గువాహటి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, నిట్‌లలో ప్రవేశం కల్పిస్తారు. బీటెక్, బీఎస్, బీఆర్క్, డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంటెక్), డ్యూయల్ డిగ్రీ (బీఎస్ + ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ 2023లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌  పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 25 Dec 2022 06:17 PM (IST) Tags: Telangana State Eligibility Test TS SET 2022 Dates TS SET 2022 Schedule TS SET 2022 Application TS SET 2022 Notification

సంబంధిత కథనాలు

KNRUHS: యూజీ ఆయూష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు!

KNRUHS: యూజీ ఆయూష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!