అన్వేషించండి

TS POLYCET 2023 Rank Cards: పాలిసెట్-2023 ర్యాంకు కార్డులు వచ్చేశాయ్! డౌన్‌లోడ్ చేసుకోండి!

అధికారిక వెబ్‌సైట్‌లో పాలిసెట్ ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు/ఫోన్ నెంబరు ఆధారంగా ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పాలిసెట్‌-2023’ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 26న ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ ఫలితాలను  విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన ఎనిమిది రోజుల్లోనే ఫలితాలు ప్రకటించడం విశేషం. ఫలితాలతోపాటు విద్యార్థుల ర్యాంకు కార్డులను కూడా అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు/ఫోన్ నెంబరు ఆధారంగా ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎంపీసీ విభాగంలో 85.73 శాతం, ఎంబైపీసీ స్ట్రీమ్‌లో 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్‌లో 78.61 శాతం మంది, బైపీసీ విభాగంలో 78.62 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షకు 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. 98,273 (92.94%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు.  ఎంపీసీ విభాగంలో 43,001 మంది అబ్బాయిలు, 3,357 మంది బాలికలు అర్హత సాధించగా, బైపీసీ స్ట్రీమ్‌లో.. 43,006 మంది అబ్బాయిలు, 37,746 మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు.  

పాలిసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

పాలిసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..

మే 17న ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. 98,273 మంది  పరీక్షకు అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్యవ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు.

పాలిసెట్‌లో ఉత్తీర్ణులైన‌వాళ్లు ఇంజినీరింగ్, నాన్–ఇంజినీరింగ్, టెక్నాల‌జీ సంబంధిత‌ డిప్లొమా కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ క‌ళాశాల్లో చ‌దువుకునే వీలుంది. అగ్రిక‌ల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాల‌జీ, ఆర్గానిక్ అగ్రిక‌ల్చర్ కోర్సుల‌ను ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ యూనివ‌ర్సిటీ, శ్రీ కొండా ల‌క్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివ‌ర్సీటీలు అందిస్తున్నాయి.

వేర్వేరు ర్యాంకులు..
పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను తయారు చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు.

అర్హత మార్కులు..

➥ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు.

➥ వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు త‌ప్పనిసరిగా స్కోర్ చేయాలి.

Also Read:

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్‌-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru | ఆర్సీబీ బౌలర్ల తడా ఖా.. వణికిపోయిన SRH | ABPYS Sharmila on YS Jagan | పసుపు కలర్ చంద్రబాబు పేటేంటా..?నీ సాక్షి పేపర్ లో ఉన్న పసుపు మాటేంటీ |Pawan Kalyan on YS Jagan | కోస్తా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ అంటున్న పవన్ | ABP DesamGoogle Golden Baba | రోజుకు 4 కేజీల బంగారు నగలు వేసుకుంటున్న గూగుల్ గోల్డెన్ బాబా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Embed widget