News
News
వీడియోలు ఆటలు
X

TS Models School: తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!

తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. పదోతరగతి పాసైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

FOLLOW US: 
Share:

తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.

వివరాలు...

* ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు -2023

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రవేశ విధానం: రిజర్వేషన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.05.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.05.2023.

➥ స్కూళ్లవారీగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా: 26.05.2023.

➥ ఎంపికైన విద్యార్థుల జాబితా: 26.05.2023.

➥ ధ్రువపత్రాల పరిశీలన: 29.05.2023 - 31.05.2023.

➥ తరగతులు ప్రారంభం: 01.06.2023.

Notification

Online Application

                           

Also Read:

ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్‌-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, పరీక్షల తేదీలివే!
తెలంగాణలో మే 9న ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ు నిర్వహించ‌నున్నట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం (మే 17) తెలిపింది. ఈ మేర‌కు ప‌రీక్షల టైం టేబుల్‌ను కూడా విడుద‌ల చేసింది. ప్రథ‌మ సంవ‌త్సరం విద్యార్థుల‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ద్వితీయ సంవ‌త్సరం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు.
సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. కాంపొజిట్ పేపర్లకు మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు 4,94,620 మంది విద్యార్ధులు హాజరయ్యారు. పదోతరగతిలో మొత్తం 86.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. 88.53 శాతం బాలికలు పాస్ అయ్యారు. ఇక 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్‌లో నిలవడం విశేషం. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. 25 పాఠశాలల్లో 0 శాతం ఫలితాలు వచ్చాయి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 18 May 2023 10:27 PM (IST) Tags: Education News in Telugu Model Schools Admissions Model Schools Inter Admissions Telangana Model Schools TSMS Inter Admissions

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!