News
News
వీడియోలు ఆటలు
X

TS SSC Supplimentary Exams: పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. కాంపొజిట్ పేపర్లకు మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ ఏడాది తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు 4,94,620 మంది విద్యార్ధులు హాజరయ్యారు. పదోతరగతిలో మొత్తం 86.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. 88.53 శాతం బాలికలు పాస్ అయ్యారు. ఇక 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్‌లో నిలవడం విశేషం. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. 25 పాఠశాలల్లో 0 శాతం ఫలితాలు వచ్చాయి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షల షెడ్యూలు ఇలా..

జూన్‌ 14న: ఫస్ట్ ల్యాంగ్వేజ్‌ (గ్రూప్‌-A), ఫస్ట్ ల్యాంగ్వేజ్‌ (పార్ట్-1 కంపోజిట్ కోర్సు), ఫస్ట్ ల్యాంగ్వేజ్‌ (పార్ట్-2 కంపోజిట్ కోర్సు).

జూన్ 15న: సెకండ్‌ ల్యాంగ్వేజ్‌

జూన్‌ 16న: థర్డ్‌ ల్యాంగ్వేజ్‌ (ఇంగ్లిష్)

జూన్‌ 17న: మ్యాథమెటిక్స్‌

జూన్‌ 19న: సైన్స్ (పార్ట్-1: ఫిజికల్ సైన్స్, పార్ట్-2: బయాలాజికల్ సైన్స్)

జూన్ 20న: సోషల్ స్టడీస్

జూన్ 21: OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్-1 (సంస్కృతం, అరబిక్‌)

జూన్ 22: OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్-2 (సంస్కృతం, అరబిక్‌)

Also Read:

ఇంటర్‌ ఫిజిక్స్‌లో 60కి 59 మార్కులు, ఫలితాల్లో ఫెయిల్! మూల్యాంకనంలో తప్పిదం!
ఏపీలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మే 16న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడి నేపథ్యంలో జవాబుపత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు బయటపడుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు హాజరైన చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమికి మూల్యాంకన తప్పిదం కారణంగా తీవ్ర మానసిక వ్యథకు గురికావాల్సి వచ్చింది. ఇంటర్ ఫలితాల్లో గౌతమి ఫిజిక్స్‌లో ఫెయిల్ అని వచ్చింది. దీంతో మానసిక ఆందోళనకు గురైన అమ్మాయి రీవెరిఫికేషన్‌, జవాబు పత్రం కోసం దరఖాస్తు చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు - రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ గడువు కూడా!
తెలంగాణలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు మే 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించాల‌ని ఇంట‌ర్ బోర్డు నిర్ణయించిన విష‌యం విదిత‌మే. ఫెయిలైన విద్యార్థులు మే 16 వ‌ర‌కు సంబంధిత కాలేజీల్లో ప‌రీక్ష ఫీజు చెల్లించాల‌ని అధికారులు ఆదేశించారు. అయితే ఆయా కాలేజీల యాజ‌మాన్యాలు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల విజ్ఞప్తుల మేర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువును మే 19 వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

'దోస్త్‌' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, రిజిస్ట్రేషన్ల పూర్తి షెడ్యూలు ఇలా!
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఆన్‌లైన్‌ దోస్త్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 16న ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు. తొలిరోజే 4722 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారని పేర్కొన్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 17 May 2023 05:57 PM (IST) Tags: Education News in Telugu TS Tenth Exams Tenth Supplimentary Exams SSC Advance Supplimentary Exams

సంబంధిత కథనాలు

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!