(Source: ECI/ABP News/ABP Majha)
AP Inter Revaluation: ఇంటర్ ఫిజిక్స్‌లో 60కి 59 మార్కులు, ఫలితాల్లో ఫెయిల్! మూల్యాంకనంలో తప్పిదం!
ఏపీలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మే 16న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడి నేపథ్యంలో జవాబుపత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు బయటపడుతున్నాయి.
ఏపీలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మే 16న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడి నేపథ్యంలో జవాబుపత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు బయటపడుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు హాజరైన చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమికి మూల్యాంకన తప్పిదం కారణంగా తీవ్ర మానసిక వ్యథకు గురికావాల్సి వచ్చింది. ఇంటర్ ఫలితాల్లో గౌతమి ఫిజిక్స్‌లో ఫెయిల్ అని వచ్చింది. దీంతో మానసిక ఆందోళనకు గురైన అమ్మాయి రీవెరిఫికేషన్, జవాబు పత్రం కోసం దరఖాస్తు చేసింది.
Also Read: ఇంటర్ రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్ విద్యామండలి మే 16న విడుదల చేయడంతో అసలు విషయం బయటపడింది. రీవెరిఫికేషన్‌లో 60 మార్కులకు గానూ 59 వచ్చాయి. బోర్డు అధికారుల తప్పిదంతో ఈ అమ్మాయి ఎంతో మానసిక వ్యథకు గురైంది. ఏపీలో ఏప్రిల్ 26న ఇంటర్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు.
Also Read:
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు - రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ గడువు కూడా!
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించిన విషయం విదితమే. ఫెయిలైన విద్యార్థులు మే 16 వరకు సంబంధిత కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. అయితే ఆయా కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మే 19 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 16తో ముగియాల్సిన గడువును, విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు మే 19 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అలాగే.. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువును మే 17 వరకు పొడిగించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'దోస్త్' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, రిజిస్ట్రేషన్ల పూర్తి షెడ్యూలు ఇలా!
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఆన్‌లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 16న ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు. తొలిరోజే 4722 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని పేర్కొన్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..