TS LAW CET Admit Card: నేటి నుంచి లాసెట్ హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ పరీక్షల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి lawcet.tsche.ac.in ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ పరీక్షల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ నేటి (ఆగస్టు 12) నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పరీక్షల కన్వీనర్ ఆచార్య జీబీ రెడ్డి వెల్లడించారు.
లాసెట్ కోసం 39,866 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ తెలిపారు. మూడేళ్ల పాటు ఉంటే లాసెట్‌కు 28,904 మంది, ఐదేళ్లపాటు ఉండే లాసెట్‌కు 7,676 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక పీజీ లాసెట్‌కు 3,286 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను lawcet.tsche.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
ఆగస్టు 23, 24 తేదీల్లో పరీక్షలు..
లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు ఆగస్టు 23, 24 తేదీల్లో జరగనున్నాయి. టీఎస్ లాసెట్ మూడేళ్ల కోర్సు పరీక్ష 23న రెండు సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుంది. ఇక ఆగస్టు 24న టీఎస్ లాసెట్ ఐదేళ్ల కోర్సు, టీఎస్ పీజీఎల్ సెట్ (ఎల్ఎల్ఎం) పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి ఒకే సెషన్ ఉంటుంది. ఇవి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు జరుగుతాయి.
26న ప్రిలిమనరీ 'కీ'..
ఈ పరీక్షల ప్రిలిమనరీ 'కీ'ని ఆగస్టు 26న విడుదల చేయనున్నారు. 'కీ' మీద అభ్యంతరాలను ఆగస్టు 27 సాయంత్రం 5 వరకు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ద్వారా మూడు, ఐదేళ్ల పాటు ఉండే ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. ఇక పీజీఎల్ సెట్ (పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ద్వారా రెండేళ్ల పాటు ఉండే ఎల్ఎల్ఎం కోర్సులో చేరవచ్చు.
హాల్‌టికెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
- టీఎస్ లాసెట్ అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.in ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో ఉన్న టీఎస్ లాసెట్ అడ్మిట్ కార్డు 2021 లింక్‌ను క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్ నొక్కాలి.
- స్క్రీన్ మీద అడ్మిట్ కార్డు వివరాలు కనిపిస్తాయి.
- కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం ఒక హార్డ్ కాపీని ఉంచుకోవాలి.
Also Read: TS Eamcet counselling: 30 నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?