టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండా మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండా మే 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును మే 1 వరకు పొడిగిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ ఏప్రిల్ 26న ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వాస్తవానికి దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగిసింది. అయితే గడువును మరో వారం రోజులపాటు పొడిగించారు.
జనరల్, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మే 5వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎడ్‌సెట్‌ను మే 18న ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో నిర్వహిస్తారు. ఎడ్‌సెట్‌ను గతంలో ఉస్మానియా వర్సిటీ నిర్వహించింది. ఈ ఏడాది నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
టీఎస్ ఎడ్‌సెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 వరకు ఉన్న దరఖాస్తు గడువును ఏప్రిల్ 25 వరకు పొడిగించింది. దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తులను ఏప్రిల్ 30న ఎడిట్ చేసుకోవచ్చు. మే 5 నుంచి ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించి, మే 21న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించి, తదనంతరం ఫైనల్ కీతోపాటు, ఫలితాలను విడుదల చేస్తారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.550, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ TS Ed.CET – 2023 నోటిఫికేషన్ వెల్లడి: 04.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.04.2023. (01.05.2023 వరకు పొడిగించారు)
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.04.2023.
➥ పరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి: 05.05.2023.
➥ TS Ed.CET-2023 పరీక్ష తేది: 18.05.2023.
➥ పరీక్ష సమయం: మొదటి సెషన్: 09.00 AM -11.00 AM, రెండో సెషన్: 12.30 PM - 02.30 PM, మూడో సెషన్: 04.00 PM - 06.00 PM
➥ ప్రిలిమినరీ కీ విడుదల: 21.05.2023
➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 24.05.2023 వరకు.
➥ ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.
టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
Also Read:
సీయూఈటీ పీజీ - 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఏప్రిల్ 19తో ముగియాల్సిన గడువును మే 5 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా వెంటనే తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించింది. పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్, ఫలితాల ప్రకటన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన ఏప్రిల్ 14న విడుదల చేసింది. ఇంగ్లిష్, హిందీ, ఎడ్యుకేషన్, చరిత్ర, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనిర్వాన్‌మెంటల్ సైన్స్ విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్ లేదా 04023680411, 04023680241, 18005990101 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. మే 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు అభ్యర్థులు మే 8లోగా పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..